Overthinking: అతిగా ఆలోచిస్తున్నారా?
Hyderabad: అతిగా ఆలోచిస్తూ సతమతమవుతున్నారా? ఈ ఓవర్ థింకింగ్ (over thinking) నుంచి బయటపడాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే..!
అతిగా ఆలోచించేవారి (over thinking) సంఖ్య ఈ ప్రపంచంలో 70% మంది ఉన్నారు. అందులోనూ 25 నుంచి 35 సంవత్సరాల వయసు వారే ఎక్కువగా ఉన్నారు. దాని వల్ల సరైన నిద్రలు ఉండవు. కడుపు నిండా తినలేరు. తిన్నా ఒంటికి పట్టదు. ఫలితాంగా ఆరోగ్యం పాడవుతుంది. దీని నుంచి మీరు నిజంగానే బయటపడాలనుకుంటే అసలు ఏ విషయం మిమ్మల్ని ఎక్కువ బాధిస్తోందో తెలుసుకోండి. ఏ సమయంలో ఎక్కువగా ఆలోచిస్తున్నారో నోట్ చేసి పెట్టుకోండి. దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తోందో కూడా రాసి పెట్టుకోండి. ఫలానా విషయం గురించి ఆలోచిస్తున్నారు అని తెలిసినప్పుడు ఏదైనా ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో వెళ్లి కూర్చోండి. మీరు రాసిపెట్టుకున్నవాటిని ఒకసారి చదువుకోండి. దీని వల్ల మీకు ఓ క్లారిటీ వస్తుంది.
కుదిరితే అన్నిటి నుంచి కాస్త బ్రేక్ తీసుకోండి. మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్లండి. దీని వల్ల అనేక ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్న మీ మైండ్‌కు రెస్ట్ దొరుకుతుంది. మీ శ్వాసపై దృష్టిపెట్టి కాసేపు ధ్యానం చేయండి. మీరు ఆలోచిస్తున్న విషయం ఎంత సీరియస్ అనేది చూసుకోండి. అసలు దాని గురించి అంతగా ఆలోచించాలా లేదా అనేది అర్థమవుతుంది. ఫ్యూచర్, పాస్ట్ గురించి ఆలోచిస్తున్నట్లైతే.. ఇక ప్రెజెంట్ జీవితాన్ని ఎలా అనుభవిస్తారు చెప్పండి. ఈ క్షణం ఎలా ఉన్నాం అనేదే కదా ముఖ్యం. దీనినే మైండ్‌ఫుల్‌నెస్ అంటారు. దీనిని ప్రాక్టీస్ చేస్తే.. కొన్ని రోజుల్లోనే ఓవర్ థింకింగ్ నుంచి బయటపడతారు. ఇలా ఎక్కువగా ఆలోచిస్తూ తినకుండా పడుకోకుండా ఉంటే మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక్కసారి ఆలోచించి చూడండి. ఏం జరుగుతుందో అని ఇప్పటినుంచి భయపడుతూ ఆలోచిస్తూ కూర్చోవడం మంచిదా? ఆరోగ్యంగా ఉంటూ ఏం వచ్చినా చూసుకుందాం అన్న మైండ్‌సెట్ మంచిదా?