Periods: ఈ తప్పులు అస్సలు చేయకండి
Hyderabad: పీరియడ్స్ (periods) సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు అని అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. అవేంటంటే..
పీరియడ్స్ (periods) సమయంలో ఆడవాళ్లు తీసుకునే ఆహారం ఎంతో ముఖ్యం. సాధారణంగా పీరియడ్స్‌లో ఉన్నప్పుడు ఆహారం గోరువెచ్చగా ఉన్నప్పుడే తినాలి. అప్పుడే బ్లడ్ ఫ్లో స్మూత్‌గా ఉంటుంది. అందుకే నువ్వులు, బెల్లంతో చేసిన ఉండలు ఎక్కువగా తీసుకోమంటారు పెద్దలు. పీరియడ్స్‌లో ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్, కూల్ వాటర్ అస్సలు వద్దు. సాయంత్రం సమయంలో సలాడ్స్, బ్య్లాక్ కాఫీ, గ్రీన్ టీ, నానబెట్టని నట్స్ మాత్రం వద్దు. వీటి వల్ల కడుపు విపరీతంగా నొప్పి పెడుతుంది. ఫలితంగా బ్లోటింగ్ (bloating) అవుతుంది. పీరియడ్స్ (periods) సమయంలో డైజెషన్ చాలా నిదానంగా ఉంటుంది. కాబట్టి బాగా వేయించిన పదార్థాల జోలికి పోవద్దు. ఈ ఐదు రోజులు ఇంట్లో తయారుచేసిన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వండి.
పీరియడ్స్ (periods) వచ్చినప్పుడు తలస్నానం చేయమంటుంటారు. నిజానికి పీరియడ్స్ సమయంలో హెడ్ బాత్ చేస్తేనే పొత్తి కడుపులో విపరీతంగా నొప్పులు వస్తుంటాయి. ఆయుర్వేద (ayurveda) శాస్త్రం ప్రకారం పీరియడ్స్ (periods) వచ్చినప్పుడు అసలు స్నానమే చెయ్యకూడదట. కానీ ఇప్పుడున్న కాలంలో అలా కుదరదు కాబట్టి కనీసం పీరియడ్స్ అవుతున్నన్ని రోజులు తలస్నానం (head bath) చేయకుండా గోరువెచ్చని నీళ్లతో మామూలు స్నానం చేయండి. ముఖ్యంగా వర్కవుట్స్ మాత్రం అస్సలు వద్దు. ఆల్రెడీ పీరియడ్స్ వల్ల లోపల జరగాల్సిన ఎక్సర్సైజ్ జరిగిపోతుంటుంది. మీరు మళ్లీ జిమ్‌లకు వెళ్లి చెమటోడ్చాల్సిన అవసరం లేదు.