OG: ప‌క‌డ్బందీగా ప్లాన్ చేసావ్ సుజీత్‌..!

Hyderabad: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) న‌టిస్తున్న OG సినిమా నుంచి రోజుకో స‌ర్‌ప్రైజ్ ఇస్తున్నాడు డైరెక్ట‌ర్ సుజీత్ (sujeeth). హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్ మోహ‌న్ (priyanka arul mohan) అని ఎప్ప‌టినుంచో రూమ‌ర్స్ వ‌చ్చాయి కానీ.. మిగ‌తా కాస్ట్ మాత్రం నిజంగానే స‌ర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఇందులో అర్జున్ దాస్, శ్రియ రెడ్డి, ఇమ్రాన్ హ‌ష్మీలు కూడా న‌టించనున్న‌ట్లు ప్ర‌క‌టించింది టీం. బాలీవుడ్ హీరో ఇందులో విల‌న్‌గా న‌టించ‌బోతున్నారు అని వార్త‌లు వ‌చ్చినా.. అది ఇమ్రాన్ హాష్మి (emraan hashmi) అని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. అప్పుడెప్పుడో పందెం కోడి సినిమాలో విల‌న్‌గా న‌టించి ఫేడ్ అవుట్ అయిపోయిన శ్రియా రెడ్డి (sriya reddy) ఇందులో కీ రోల్‌లో న‌టిస్తుంద‌ని కూడా ఎవ‌రూ అనుకోలేదు. చూడ‌బోతే డైరెక్ట‌ర్ సుజీత్.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి ఏం కావాలో దానిని ప‌క్కాగా ప్లాన్ చేసుకున్నాడు అనిపిస్తోంది.

ర‌న్ రాజా ర‌న్ సినిమాతో హిట్ కొట్టిన సుజీత్ (sujeeth) ట్యాలెంట్‌కు మెచ్చి సాహో సినిమాను ఆయ‌న చేతుల్లో పెట్టాడు ప్ర‌భాస్ (prabhas). కానీ ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేదో అయ్యింద‌ని ఆ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్ అయింది. దాంతో పాపం ప్ర‌భాస్ ఫ్యాన్స్ సుజీత్‌ని ఒక ఆట ఆడుకున్నారు. దాంతో సుజీత్.. సినిమా మీకు అర్థంకాలేదు అంటూ ఎక్స్‌ప్ల‌నేష‌న్ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. దాంతో ఎలాగైనా తానేంటో నిరూపించుకోవాల‌ని ప‌వ‌న్ లాంటి స్టార్ కోసం క‌థ సిద్ధం చేసుకున్నాడు. రొటీన్ ఫేసెస్‌ని కాకుండా చూసి చాలా కాల‌మైన వారిని ఇందులో కాస్ట్‌గా పెట్టుకున్నాడు. బాలీవుడ్‌లో చాలా మంది విల‌న్ క్యారెక్ట‌ర్లు వేసేవారు ఉన్నారు కానీ ఇమ్రాన్ హాష్మి లాంటి హీరోని ఫ‌స్ట్ టైం విల‌న్‌గా చూపించ‌బోతున్నాడు. ఈసారైనా సుజీత్ తన ప‌వ‌రేంటో నిరూపించుకుంటాడో లేదో చూడాలి.