Mahesh Babu: ఈ గుంటూరు కారం య‌మ హాట్ గురూ..!

Hyderabad: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu) BTS (బిహైండ్ ది సీన్స్) ఫొటోల‌ను షేర్ చేయ‌డంతో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. 20ల్లో ఉన్న‌ట్లు మ‌హేష్ (mahesh babu) లుక్స్ ర‌చ్చ పుట్టిస్తున్నాయి. ఇది నిజంగానే గుంటూరు కార‌మే (guntur karam) గురూ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొంద‌రైతే అస‌లు నీకు ఒక్క‌డికే వ‌య‌సు వెన‌క్కి వెళ్తున్న‌ట్లుంది అన్నా అంటూ తెగ పొగిడేస్తున్నారు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నారు మ‌హేష్. ఇందులో పూజా హెగ్డే (pooja hegde) హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్‌తో గూస్‌బంప్స్ తెప్పించారు మ‌హేష్‌. మ‌ళ్లీ మాస్ వింటేజ్ మ‌హేష్‌ని థియేట‌ర్‌లో చూడ‌బోతున్నాం. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాల‌ని చూస్తున్నారు.