Pregnancy: పెళ్లికి ముందే తల్లులైపోతున్నారు..!
Hyderabad: ప్రతి ఆడపిల్ల తల్లి కావాలని (pregnancy) కలలు కంటుంది. కానీ మన భారతీయ సంప్రదాయం ప్రకారం.. పెళ్లి జరిగిన తర్వాతే ఆడపిల్ల తల్లి కావాలి. కానీ ఇప్పుడు కాలం మారింది. ఆలోచనా విధానాలు మారుతున్నాయి. పెళ్లికి ముందే పిల్లల్ని కంటే కనేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. మారాల్సింది మీ నీచమైన ఆలోచనలే అంటున్నారు. ఇటీవల నటి ఇలియానా (ileana) తల్లికాబోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేసారు. కొందరు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడితే.. మరికొందరు మీకు పెళ్లైందా? మీ భర్త ఎవరు? అని ప్రశ్నలు వేసారు. చెప్పాలంటే కంగ్రాట్స్ చెప్పినవారి సంఖ్య కంటే పెళ్లైందా అని ప్రశ్నించినవారే ఎక్కువ. అఫ్కోర్స్ పెళ్లి తర్వాత పిల్లల్ని కనాలా పెళ్లికి ముందు కనాలా అనేది ఎవరి ఇష్టం వారిది.
ఇలా పెళ్లికాకుండానే తల్లులైన నటీమణుల్లో నేహా ధుపియా, అర్జున్ రాంపాల్ ప్రేయసి గ్యాబ్రియెల్లా, ఆలియా భట్ (alia bhatt) కూడా ఉన్నారు. ఆలియా భట్ పెళ్లి సమయంలోనే రెండేళ్ల గర్భవతి అని చాలా కథనాలు వచ్చాయి. అయినప్పటికీ నేహా, ఆలియాలు ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే పెళ్లిళ్లు చేసేసుకున్నారు. ఇలా పెళ్లి కాకుండానే పిల్లల్ని కనేస్తే ఆ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? దీని ప్రభావం భారత యువతపై ఎంతో ఉంటుందని అంటున్నారు.
. అందుకే ఇప్పటికీ ఎవరినైనా పలకరించేటప్పుడు వారిని పెళ్లైందని తెలిసాక ఎంత మంది పిల్లలు అడుగుతున్నారే కానీ పెళ్లి కాకుండా రిలేషన్షిప్లో ఉన్నవారిని ఎంత మంది పిల్లలు అని అడగడం లేదు. హీరోయిన్లు, డబ్బున్నవారు కాబట్టి వారు ఏం చేసినా చెల్లుతుంది. కానీ కామల్ పీపుల్‌కి అలా కాదు. పెళ్లికాకుండా ఓ ఆడపిల్ల బిడ్డను కంటే ఇప్పటికీ సమాజం చులకనగా చూస్తుంది. అలాగని పెళ్లికాకుండా పిల్లల్ని కనాలి అనుకుంటున్నవారు తప్పుడు మనుషులు అని కాదు. ఎవరి ఇష్టం వారిది. కానీ కొన్ని సంప్రదాయాలను పాటిస్తేనే బాగుంటుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.