Adipurush: ప్రతి థియేటర్లో ఒక సీటు హనుమంతుడి కోసం!
Hyderabad: ప్రభాస్ (prabhas) నటించిన ప్రతిష్ఠాత్మక సినిమా ఆదిపురుష్ (adipurush) 16న రిలీజ్ అవబోతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ (kriti sanon) సీతమ్మవారి పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా ఏ థియేటర్లలో రిలీజ్ అవుతుందో ఆ థియేటర్లో అన్ని సీట్లు అమ్ముడుపోయినప్పటికీ ఒక సీటును మాత్రం హనుమంతుడి (hanuman) కోసం రిజర్వ్ చేయబోతున్నారు. అంటే తన రామయ్య గాథను తెరపై చూసేందుకు సాక్షాత్తు హనుమంతుడే అన్ని థియేటర్లలోకి వచ్చి తన రామయ్యను చూసుకుంటాడని చిత్రబృందం నమ్మకం.
ఈ సినిమాలో రాముడు, సీత పాత్రలకంటే హనుమంతుడి పాత్రే కీలకంగా ఉండబోతోందట. దేవదత్త నగే (devdatta nage) హనుమంతుడి పాత్రలో నటించారు. సన్నీ సింగ్ (sunny singh) లక్ష్మణుడి పాత్రను పోషించాడు. ఈరోజు తిరుపతిలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున ప్రభాస్‌తో పాటు ఆదిపురుష్ టీం శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి వేడుక ప్రారంభం అవుతుంది. వేడుకకు చీఫ్ గెస్ట్‌గా చినజీయర్ స్వామి రాబోతున్నారు. స్టేజ్‌పై ప్రభాస్ది 50 అడుగుల హోలోగ్రాఫిక్ కటౌట్ పెట్టబోతున్నారట. 100 మంది డ్యాన్సర్లు, 100 మంది సింగర్లతో ఈవెంట్ సూపర్ గ్రాండ్‌గా చేయబోతున్నారు.