Bihar: క్షణాల్లో కూలిన రూ.1700 కోట్ల విలువైన వంతెన
Bihar: ఒడిశా రైలు ప్రమాద ఘటన (odisha train accident) మరువకముందే బిహార్‌లో (bihar) ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న 4 లేన్ వంతెన (bridge collapsed) నీళ్లలో కుప్పకూలిపోయింది. బిహార్‌లోని భగల్పూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిని దాదాపు రూ.1700 కోట్లు పెట్టి మరీ నిర్మిస్తున్నారు. ఇదే వంతెన గతేడాది డిసెంబర్లో కూలింది. దాంతో మరోసారి నిర్మాణ పనులు చేపట్టారు. ఆ సమయంలో వంతెన సమీపంలో ఓ గార్డు ఉన్నాడు. ఆ గార్డు కనిపించకుండాపోయాడు. దాంతో అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. 2014లో ఈ వంతెనను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (nitish kumar) ప్రారంభించారు. అసలు వంతెన ఎలా కూలింది అన్న ఘటనపై క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు నితీష్ తెలిపారు. దాంతో BJP ప్రభుత్వం ఇప్పుడు నితీష్ కుమార్‌పై నిప్పులు చెరుగుతోంది. ఓడిశా రైలు ప్రమాదం జరిగినప్పుడు బీజేపీదే బాధ్యత అని రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయాలని అన్నప్పుడు, బిహార్ బ్రిడ్జ్ కూలినందుకు నితీష్ కుమార్ రిజైన్ చేస్తారా అంటూ ప్రశ్నించారు.