Viveka Case: జగన్ KCRని మోసం చేయడం బాధాకరం!
Hyderabad: YCP ఎంపీ రఘురామ కృష్ణరాజు (raghu rama krishna raju) తెలంగాణ సీఎం KCRపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దిల్లీ మద్యం కుంభకోణంలో (delhi liquor case) నిందితుడిగా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి (Sarath chandra reddy) అప్రూవర్‌గా మారారు. అయితే ఆయన అప్రూవర్‌గా ఎందుకు మారాల్సి వచ్చిందో రఘురామ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. లిక్కర్ కేసులో కొందరి పేర్లను బయటపెడితే.. వైఎస్ వివేకా కేసులో (viveka case) కీలక నిందితుడి పేరు బయటకురాకుండా చూస్తామని ఎవరో అన్నట్లు తన దాకా వచ్చిందని, దీనిని బట్టి చూస్తే ఏపీ సీఎం జగన్.. కేసీఆర్‌ను మోసగిస్తున్నట్లు అర్థమవుతోందని అన్నారు. అప్రూవర్‌గా మారిన శరత్‌చంద్రా రెడ్డి జగన్‌కు మంచి మిత్రుడని, ఆయన అప్రూవర్‌గా మారకముందే సాక్షి ఛానెల్లో ఆయన అప్రూవర్‌గా మారిపోయినట్లు ఎలా వార్త ముందే తెలిసిందని ప్రశ్నించారు.
గతంలో YCP పార్టీ గెలవడానికి కేసీఆర్ పార్టీ ఎంతో సాయం చేసిందని టాక్ ఉందని, అలాంటి కేసీఆర్‌నే జగన్ మోసం చేయాలనుకోవడం బాధాకరమని అన్నారు. అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రా రెడ్డి ఎవరి పేర్లు బయటపెడతారో వేచి చూడాలంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసారు రఘురామ కృష్ణరాజు.