‘పఠాన్’​ కలెక్షన్​ సునామి..”బాహుబలి2″ని దాటేసి మరీ!

షారూఖ్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ ప‌ఠాన్. ఈ చిత్రం బాహుబ‌లి 2 హిందీ వెర్ష‌న్ క‌లెక్ష‌న్స్‌ రికార్డుల‌ను క్రాస్ చేసి నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది. హిందీ వెర్ష‌న్ వ‌ర‌కే ప‌ఠాన్ సినిమాకు రూ.511 కోట్లు క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.
చాలా రోజుల త‌ర్వాత బాలీవుడ్ జ‌నాల‌కు కాస్త ప్ర‌శాంతంగా నిద్రపోయే అవ‌కాశం వ‌చ్చింది. ఎందుకంటే ఈ మ‌ధ్య కాలంలో మ‌న సౌత్ సినిమాల హ‌వా బాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. వారి సినిమాలేమో డిజాస్ట‌ర్ అవుతుంటే మ‌న సినిమాలు మాత్రం అక్క‌డ బ్లాక్ బ‌స్ట‌ర్స్ అవుతున్నాయి. ఇది చాలా మందికి మింగుడుప‌డ‌లేదు. అయితే ఏం చేయలేక చూస్తుండిపోవాల్సిన ప‌రిస్థితి. అయితే ఈ ప‌రిస్థితికి ‘ప‌ఠాన్‌’ బ్రేక్ ఇచ్చింది. జ‌న‌వ‌రి 25న విడుద‌లైన ఈ చిత్రం వ‌సూళ్ల ప‌రంగా దుమ్ముదులిపింది.

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘పఠాన్’ . దీపికా ప‌దుకొనె హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో జాన్ అబ్ర‌హం విల‌న్‌గా న‌టించారు. భారీ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్‌గా జ‌న‌వ‌రి 25న ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైంది. హై ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో విడుద‌లైన ఈ చిత్రం అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే రాణిస్తుంది. రెండు రోజుల్లోనే ‘పఠాన్’ సినిమా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రారంభం నుంచి ఈ మూవీ కలెక్ష‌న్స్ ప‌రంగా రికార్డుల‌ను సాధిస్తూ దూసుకెళ్తోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌ష్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని నిర్మించింది. నాలుగేళ్ల త‌ర్వాత షారూఖ్ ఖాన్ హీరోగా న‌టించిన చిత్ర‌మిది.

భారీ వ‌సూళ్ల‌తో బాలీవుడ్‌లో హ‌య్య‌స్ట్ గ్రాసర్‌గా నిలిచింది ‘ప‌ఠాన్‌’. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఇండియాలో ఈ చిత్రం రూ.640కోట్ల‌ను రాబ‌ట్టింది. అలాగే ఓవ‌ర్‌సీస్‌లో రూ.386 కోట్ల‌ను రాబ‌ట్టింది. 37 రోజుల‌కుగానూ ప్ర‌పంచ వ్యాప్తంగా మూడు భాష‌ల్లో ‘ప‌ఠాన్‌’ చిత్రం రూ.1026 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టుకుంది. ప‌ఠాన్ విడుద‌ల రోజు నుంచి స‌రికొత్త రికార్డుల‌ను తెర తీసింది. తాజాగా ‘ప‌ఠాన్‌’ మూవీ బాలీవుడ్‌లో ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు బాహుబ‌లి 2 హిందీలో గ్రాస్ వ‌సూళ్ల ప‌రంగా నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉండింది. దాన్ని ‘ప‌ఠాన్‌’ మూవీ క్రాస్ చేసింది. బాహుబ‌లి 2 హిందీ వెర్ష‌న్ రూ.510.99 కోట్ల‌ను సాధించింది. దీన్ని ప‌ఠాన్ రూ.511 కోట్ల‌ను క్రాస్ చేసింది.
దీంతో హిందీ వెర్ష‌న్‌లో టాప్ మూవీస్ లిస్టులో ప‌ఠాన్ మొద‌టి స్థానాన్ని ద‌క్కించుకోగా, రెండో స్థానంలో బాహుబ‌లి 2, మూడో స్థానంలో కె.జి.య‌ఫ్ 2, నాలుగుఓ స్థానంలో దబాంగ్‌ సినిమాలు నిలిచాయి. ఈ సినిమా సాధించిన లేటెస్ట్ రికార్డ్‌పై ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. చాలా గ‌ర్వ‌ప‌డే క్ష‌ణాలివి అంటూ కామెంట్ చేశారు. ఈయ‌న డైరెక్ష‌న్‌లో య‌ష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ‘ప‌ఠాన్‌’ చిత్రంలో షారూఖ్ ఖాన్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తే.. ఆయ‌న‌కు జోడీగా దీపికా ప‌దుకొనె న‌టించింది. జాన్ అబ్ర‌హం విల‌న్‌గా న‌టిస్తే.. కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్, గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇచ్చారు.
తొలి రోజున ఈ చిత్రానికి హిందీలో రూ.55 కోట్లు నెట్ క‌లెక్ష‌న్స్ రాగా.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌లిపి రూ.2 కోట్లు వ‌చ్చాయి. ఓవ‌ర్ సీస్‌లో 4.2 మిలియ‌న్ డాల‌ర్స్ వ‌చ్చాయి. అంటే రూ.36 కోట్లు పైచిలుకే. మొత్తంగా చూస్తే రూ.103 కోట్ల రూపాయ‌ల గ్రాస్ వసూళ్లను ‘పఠాన్’ చిత్రం రాబ‌ట్టింది. ఇక రెండ‌వ రోజు నేష‌న‌ల్ హాలీడే కావ‌టంతో ఈ కలెక్ష‌న్స్ ఇంకా ఎక్కువ‌గా పెరిగాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. ఇక రెండో రోజున ఈ చిత్రానికి రూ.72 కోట్ల నెట్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి ఓవ‌ర్ సీస్‌లో 3.7 మిలియ‌న్ డాల‌ర్స్ వ‌చ్చాయి. అంటే మొత్తంగా రూ.114 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను ప‌ఠాన్ సినిమా రాబ‌ట్టింది.