Ravindra Jadeja: ఇంకోసారి ఔట్ అవ్వమని అనరు!
Hyderabad: ఎప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ (chennai super kings) మ్యాచ్ ఉన్నా.. రవీంద్ర జడేజా (ravindra jadeja) ఆడేటప్పుడు CSK ఫ్యాన్స్ ఎప్పుడూ అంత ఉత్సాహం చూపించేవారు కాదు. కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (ms dhoni) గ్రౌండ్లోకి దిగితే csk ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతుంటారు. ధోనీ ధోనీ (dhoni) అంటూ స్టేడియం దద్దరిల్లిపోయేలా అరుస్తుంటారు. కానీ జడేజా ఎంటర్ అయినప్పుడు మాత్రం ఆ ఉత్సాహం కనిపించదు. జడేజా (jadeja) పేరుపై అరుపులు ఉండవు. పైగా జడేజా ఎప్పుడు బ్యాటింగ్‌కి వచ్చినా.. ప్లీజ్ ఓడిపో.. మా ధోనీ వస్తాడు అని బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని అరుస్తుంటారు. ఇలాంటివి చూసినప్పుడు ఏ ఆటగాడికైనా కాస్త బాధగా ఉంటుంది. ధోనీకి ఫ్యాన్స్ అయినంత మాత్రాన ఒకే టీం కోసం కష్టపడుతున్న మరో ఆటగాడిని తక్కువ చేసి చూడటం ఏమాత్రం సమంజసం కాదు.
దాంతో జడేజా (jageja) కూడా బాధపడ్డాడు. ఈ విషయం మొన్న జడేజా పెట్టిన ట్వీట్‌తో అందరికీ అర్థమైపోయింది. కొన్ని రోజుల క్రితం ప్రముఖ బ్రోకింగ్ సంస్థ అప్‌స్టాక్స్‌తో జడేజా టై అప్ అయ్యాడు. వారితో కలిసి ఫొటోకు పోజ్ ఇస్తున్న ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. అప్‌స్టాక్స్‌కి కూడా నేనేంటో అర్థమైంది కానీ కొందరు ఫ్యాన్స్‌కే ఇంకా అర్థంకాలేదు అని ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్ వెనక ఎంత భారమైన హృదయం ఉందో జడేజాకే (jadeja) తెలుసు. ఇప్పుడు అదే జడేజా చివరి రెండు బాల్స్‌కి 6, 4 కొట్టి csk టైటిల్ గెలిపించాడు. ఏ జడేజానైతే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓడిపో ధోనీ (dhoni) వస్తాడు అన్నారో ఆ జడేజానే ఈరోజు csk ఐదో ఐపీఎల్ టైటిల్ గెలిచేలా చేసాడు. ఈ IPL తర్వాత ఇంకెప్పుడూ జడేజా (jadeja) ఆడుతున్నప్పుడు ఓడిపో అని ఏ సీఎస్కే అభిమాని అనకుండా ఉండేలా వారి నోళ్లు మూయించాడు సర్ రవీంద్ర జడేజా.