BRO: టైటిల్ శ్లోకానికి అర్థం ఇదే..!

Hyderabad: ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్‌ (pawan kalyan), సాయిధ‌ర‌మ్ తేజ్ (sai dharam tej) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా బ్రో (bro). స‌ముద్ర‌ఖ‌ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాలోని ప‌వ‌న్, సాయి ధ‌ర‌మ్ తేజ్ ఫ‌స్ట్ లుక్స్ రిలీజ్ అయిపోయాయి. అయితే ప‌వ‌న్ లుక్‌ని, టైటిల్‌ని రిలీజ్ చేసిన‌ప్పుడు గూస్‌బంప్స్ వ‌చ్చేలా ఓ శ్లోకాన్ని (bro slokam) యాడ్ చేసారు మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్. అస‌లు ఆ శ్లోకానికి అర్థ‌మేంటో, ఎందుకు పెట్టాల్సి వ‌చ్చిందో చాలా చ‌క్క‌గా వివ‌రించారు లిరిసిస్ట్ క‌ళ్యాణ్ చక్ర‌వ‌ర్తి (kalyan chakravarthy). ఈ సినిమాలో ప‌వ‌న్ దేవుడి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇక ధ‌ర‌మ్ తేజ్ మార్కండేయులు క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తారు. త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన వినోద‌య సీతం సినిమాకు ఇది రీమేక్. దేవుడు ప్ర‌త్య‌క్ష‌మై మ‌నిషికి రెండో ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో సినిమా తీస్తున్నారు స‌ముద్ర‌ఖ‌ని. ఇంత‌కీ ఆ శ్లోకం గురించి క‌ళ్యాణ్ ఏం చెప్పారో మీరూ చూసేయండి.