Viveka Case: CBI విచారణకు సీఎం జగన్‌.. ఎప్పుడు వెళ్తారంటే?

Hyderabad: వైఎస్ వివేకా హత్య కేసు (viveka case) తొలి నుంచి అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. ఇక తాజాగా CBI తన కౌంటర్‌ అఫిడవిట్‌తో సంచలన విషయాలు బయట పెట్టింది. తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ అవినాష్‌ (avinash reddy) బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేయగా.. ఈ సందర్బంగా సీబీఐ పలు విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అవినాష్‌ను అరెస్టు చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని అప్పుడే కేసు దర్యాప్తు వేగవంతం అవుతుందని సీబీఐ పేర్కొంది. అంతేకాకుండా.. ఈ కేసుకు సంబంధించి ఏపీ సీఎం జగన్‌ పేరును ప్రస్తావించడం సంచలనంగా మారింది. వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయిన విషయం ముందుగా ఆయన పీఏ ఎంవీ కృష్ణారెడ్డికి తెలుసు.. అయితే అంతకంటేముందుగానే సీఎం జగన్‌కు హత్య విషయం తెలుసని అఫిడవిట్‌లో సీబీఐ స్పష్టం చేసింది. అయితే.. సాంకేతిక ఆధారాలు లేకుండా.. సీఎంపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే.. సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అన్నది మాత్రం ఇప్పటికైతే స్పష్టం కాలేదు.

జగన్‌ పేరు ప్రస్తవించడంతోపాటు.. అవినాష్‌కు గురించి కూడా పలు విషయాలను సీబీఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అవినాష్‌ కావాల‌నే విచారణకు హాజరు కావట్లేదని పేర్కొంది. వెంటనే బెయిల్‌ పిటిషన్‌ రద్ద చేయాలని కోర్టును సీబీఐ కోరింది. తాజాగా సీఎం జగన్‌ పేరును ప్రస్తవించడంతో ఆయన విచారణకు వస్తారా లేదా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఇక కేవలం సీఎం జగన్‌కు హత్య గురించి ముందే తెలుసు అని చెబుతున్న సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయో తెలియదు కాబట్టి.. ఆయన విచారణకు వస్తారు అన్నది ఇప్పుడు చెప్పలేం. ఒక వేళ ఆధారాలు ఉంటే.. సీఎం జగన్‌ కూడా సీబీఐ విచారణ ఎదుర్కోక తప్పదు.