Drinks: నీరసమా.. ఈ డ్రింక్స్ ట్రై చేయండి!
Hyderabad: ప్రస్తుత కాలంలో ఆరోగ్యం(Health)గా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. పనిఒత్తిడి(Work pressure), ఆందోళన కారణంగా కొన్నిసార్లు నీరసంగా అనిపిస్తుంది. మహిళ(Women)ల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రకారం ప్రతి ముగ్గురిలో ఒకరు అలసటకు గురవుతున్నారు. తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు శరీరానికి శక్తి(Energy)తోపాటు మనసుకూ కాస్త ఆహ్లాదాన్నిచ్చే పానీయాల్ని(Drinks) తీసుకోవడం మంచిది. అప్పటికప్పడు శక్తినిచ్చే డ్రింక్స్(Boosting drinks) ఏంటో చూద్దాం..
నీళ్లు(Water)
మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే పానీయాల్లో మొదటిది నీళ్లు. నిర్జలీకరణం వల్ల చాలా దుష్ప్రభావాలు కలుగుతాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే తగినంత నీరు తీసుకోవడం తప్పనిసరి. తగినంత నీళ్లు తాగకపోవడం వల్ల మానసిక సమస్యలూ కలుగుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
కాఫీ(Coffee)
కాఫీలో ఉండే కెఫీన్ నిద్రకు ప్రేరేపించే అడెనోసిన్ను నియంత్రించి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. కెఫీన్ మెదడు, గుండె పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది. అయితే శరీరంలో కెఫీన్ స్థాయిలు పెరిగితే ఆరోగ్యానికి ప్రమాదం.
స్మూతీలు(Smoothies)
తాజా పండ్లు, పాలు, చక్కెర, సబ్జీ వంటి పదార్థాలతో తయారుచేసే స్మూతీలు తక్షణ శక్తిని అందిస్తాయి. కాఫీ, టీ వంటి వాటికంటే స్మూతీలు తీసుకోవడం ఆరోగ్యకరం. వీటిలో శరీరానికి శక్తినందించే మాక్రోన్యూట్రియెంట్లు-కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు ఉంటాయి.
మాచ టీ(Matcha Tea)
ఒత్తిడి తగ్గించడంలో మాచ టీ చక్కగా పనిచేస్తుంది. దీనిలోని థియనైన్ చురుకుదనాన్ని కలిగిస్తుంది. టీ, కాఫీలకంటే ఈ టీని తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
పండ్ల రసాలు(Fresh Fruit and Veggie Juice)
తాజా పండ్లు, కూరగాయలతో చేసిన జ్యూసుల్లో తక్షణ శక్తిని అందించే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కీరా, తర్భూజా, కొబ్బరి, కివి వంటి వాటితో చేసిన డ్రింక్స్ మెదడు కణాల పనితీరును మెరుగు పరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. బీట్రూట్, క్యారెట్ వంటి వాటితో చేసిన రసాలు మంచి ఫలితం అందిస్తాయి. వీటితోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.