Phone Tapping Case: KCR అరెస్ట్‌కు రంగం సిద్ధం!
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు ఉచ్చు బిగుస్తోంది. భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి KCR అరెస్ట్‌కు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (Revanth Reddy) పాటు ఇతర కాంగ్రెస్ నేతలు, బడా వ్యాపారవేత్తల ఫోన్ ట్యాప్ చేసినట్లు కేసీఆర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో భాగంగా పోలీస్ అధికారులు అయిన ప్రణీత్ రెడ్డి, భుజంగరావు, తిరుపతయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారంతా కూడా కేసీఆర్ చెప్పారు కాబట్టే చేసామని అంటున్నారు.
ఇవాళ్లి నుంచి భుజంగరావు, తిరుపతయ్యలపై మరోసారి విచారణ జరగనుంది. వీరిద్దరికీ కోర్టు ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్‌ను మాత్రం కోర్టు కొట్టివేసింది. ఓఎస్డీ టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావును, ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎస్ఐటిలో ఉన్న గట్టు మల్లును కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ విచారించాక మరిన్ని కీలక అంశాలు బయటికి వస్తాయని భావిస్తున్నారు.
హవాలా వ్యాపారులు, బంగారు వ్యాపారులను ఆధారంగా చేసుకుని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతించడంతో అడిషనల్ ఎస్పీలను ఇంకొద్ది సేపట్లో కస్టడీలోకి తీసుకుని విచారణ చేపడతారు. రాధాకిషన్‌పై రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది అధికారుల నుంచి ఫిర్యాదులు రావడంతో వాటిని కూడా పరిశీలిస్తున్నారు. రాధాకిషన్ డీసీపీగా ఉన్న సమయంలో చాలా మందిని వేధింపులకు గురిచేసారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఫోన్ ట్యాప్ చేసిన డేటాను హార్డ్ డిస్క్‌లలో పెట్టి వాటిని ధ్వంసం చేసారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశంపై కూడా కీలకంగా విచారణ జరగనుంది. కేసీఆర్‌తో పాటు భారత రాష్ట్ర సమితికి చెందిన మరో నలుగురు నేతలు చెప్పడం వల్లే చేసామని నిందితులంతా చెప్తున్నారు. ఇలా ఎటు వైపు నుంచి చూసినా కేసీఆర్‌కు ఉచ్చు బిగుస్తోందనే చెప్పాలి. ఆయన అరెస్ట్‌కు రంగం సిద్ధం అవుతున్నట్లే అన్న టాక్ కూడా వినిపిస్తోంది.