Astrology: 2024లో ఈ రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

Astrology: 2024 సంవ‌త్స‌రంలో ద్వాద‌శ రాశుల్లోని మూడు రాశుల వాళ్లు అతి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. దానికి కార‌ణం ఏంటంటే.. జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందంటే.. ఎప్పుడైనా స‌రే 80 శాతం జాత‌కం ఫ‌లితాలు గురు బ‌లాన్ని బ‌ట్టి ఆధార‌ప‌డ‌తాయి. గురు బ‌లం అద్భుతంగా ఉంటే ఏ రాశికైనా తిరుగు ఉండ‌దు. గురు బ‌లం బాగోక‌పోతే ఆ రాశుల వారు కొన్ని ప్ర‌త్యేక‌మైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. గురుబ‌లాన్ని పెంపొందింప‌జేసుకోవాలి.

2024లో మే 1 గురువు మేష రాశిలో నుంచి వృష‌భ రాశిలోకి మారుతున్నాడు. గురువు ప్రయాణంలో మార్పు ఉంటుంది. దీని వ‌ల్ల 3 రాశుల వారికి గురుబ‌లం పూర్తిగా ప‌డిపోతోంది. కాబ‌ట్టి వీరు అతి జాగ్ర‌త్త‌గా అడుగులు వేయాలి. మ‌న జ‌న్మ రాశి నుంచి లెక్క పెట్టిన‌ప్పుడు గురువు ఆరో రాశిలో కానీ ఎనిమిదో రాశిలో కానీ 12వ రాశిలో కానీ సంచారం చేస్తున్న‌ట్లైతే.. అలాంటి గురు సంచారం ఇబ్బందుల‌ను క‌లిగిస్తుంది.  2024 సంవ‌త్స‌రంలో అతి జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన రాశులేంటో తెలుసుకుందాం. (Astrology)

తుల రాశి

ఇందుకు కార‌ణం ఏంటంటే.. తుల రాశి నుంచి లెక్క పెట్టిన‌ప్పుడు తుల, వృశ్చికం, ధ‌నుస్సు, మ‌క‌రం, కుంభం, మీనం, మేషం, వృష‌భం.. ఇలా తుల రాశి వారికి అష్ట‌మ గురువు సంచారం ఉంది. ఈ 6, 8, 12ల‌లో 8వ సంచారం గురువుకు ఉంటే చాలా ఇబ్బందులు వ‌స్తాయి. దీని వ‌ల్ల వృత్తి ప‌రంగా ఇబ్బందులు వ‌స్తాయి. డ‌బ్బు ఎక్కువ‌గా ఖ‌ర్చు అయ్యే అవ‌కాశం ఉంది. ఎంత క‌ష్ట‌ప‌డ్డా ఫ‌లితం రావ‌డం అనేది ఆల‌స్యం అవుతూ ఉంటుంది. ఏ ప‌నిలో అయినా స‌రే విజ్ఞాలు పెరిగి, ఆటంకాలు వ‌చ్చే సూచ‌న‌లు ఎక్కువ‌గా ఉంటాయి. మీ శ్ర‌మంతా కూడా బూడిద‌లో పోసిన ప‌న్నీరు అవుతుంది.

ఏం చేయాలి?

మే 1 నుంచి ఈ గురు ప్ర‌భావం ఉంటుంది. ఇలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే.. తులా రాశి వారు గురుకు సంబంధించిన శ‌క్తి వంత‌మైన ప‌రిహారం చేయాలి. గురువారం పూట నాన‌బెట్టిన శ‌న‌గల్లో కాస్త ప‌సుపు క‌లిపి గోవుకు తినిపించండి. ఇలా 9 గురువారాలు చేస్తే అష్టమ గురు దోశం తొల‌గిపోతుంది.

ధ‌నుస్సు రాశి

ధ‌నుస్సు రాశి నుంచి లెక్క పెట్టిన‌ప్పుడు ధ‌నుస్సు, మ‌క‌రం, కుంభం, మీనం, మేషం, వృష‌భం.. ఇలా ఆరో రాశిలో గురువు ఉంటాడు. అంటే ఆరో సంచారంలో ఉన్నాడు. ఈ ఆరో సంచారం వ‌ల్ల అనారోగ్య స‌మస్య‌లు, అప్పులు, శ‌త్రు బాధ‌ల‌ను ఇస్తుంది. కాబ‌ట్టి ధ‌నుస్సు రాశి వారు మే 1 నుంచి అనారోగ్య స‌మ‌స్య‌లు, అప్పుడు, శ‌త్రు బాధ‌లు ఎక్కువ‌గా ఉంటాయి.

ఏం చేయాలి?

ప్ర‌తి విష‌యంలో ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోవాలి. గురువారం రోజున శ‌న‌గ‌లు దారంతో దండ‌లాగా క‌ట్టి దత్తాత్రేయుడికి అలంక‌రించాలి. ద‌గ్గ‌ర్లో ద‌త్తాత్రేయుడి విగ్ర‌హం ఉంటే ఆ శెన‌గ‌ల దారం వేసి పూజించాలి. ఇలా 9 గురువారాలు చేస్తే మంచి ఫ‌లితాలు ఉంటాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి గురువు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇలా ఉంటే విప‌రీతంగా ఖ‌ర్చు అవుతుంది. మిథున రాశి వారు ప్ర‌తి చోట కూడా డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ప్ర‌త్యేకించి మే 1 నుంచి రూపాయి ఖ‌ర్చు పెట్టాల్సిన చోట రూ.10 ఖ‌ర్చు పెడుతుంటారు. శ‌త్రువులు పెరిగి పోయే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఏం చేయాలి?

ఈ గురు సంచార దోషం పోవాలంటే ప్ర‌తి రోజూ చిటికెడు ప‌సుపు నీటిలో క‌లుపుకుని ఐదు నిమిషాల త‌ర్వాత ఆ నీటితో స్నానం చేస్తూ ఉండాలి. దీని వ‌ల్ల ఏ గురువు దోషం ఉండ‌దు. ఏదైనా డ‌బ్బు ఖ‌ర్చు పెట్టేటప్పుడు ప్ర‌తి విష‌యంలో ఒక‌టికి ప‌ది సార్లు ఆలోచించి జాగ్ర‌త్త‌గా అడుగులు వేయాలి.