YS Sharmila: మా అన్న BJPతో అక్ర‌మ పొత్తులో ఉన్నారు

YS Sharmila: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. (Jagan Mohan Reddy) భార‌తీయ జ‌న‌తా పార్టీతో (Bharatiya Janata Party) అక్ర‌మ పొత్తులో ఉన్నార‌ని ఆరోపించారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ‌. తాను కాంగ్రెస్ పార్టీతో ఎందుకు చేతులు క‌లిపారో వివ‌రిస్తూ NewsXతో ఎక్స్‌క్లూజివ్ విష‌యాల‌ను పంచుకున్నారు.

ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు?

నేను కాంగ్రెస్ పార్టీలో చేర‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి. ఒక‌టి.. మణిపూర్ ఘ‌ట‌న‌. ఈ మ‌ణిపూర్ ఘ‌ట‌న నన్ను కదిలించింది. వారి ప‌ట్ల భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌వ‌ర్తించిన తీరు న‌న్నెంతో బాధించింది. కానీ కాంగ్రెస్ మాత్ర‌మే వారికి అక్కున చేర్చుకుంది. కాంగ్రెస్ నేత‌లు మ‌ణిపూర్‌కి రావడం చూపి ప్ర‌జ‌ల్లో ధైర్యం వ‌చ్చింది. నాకు అప్పుడు ఒక్క‌టే విష‌యం అర్థ‌మైంది. కాంగ్రెస్ పార్టీ ఇదివ‌ర‌కులా లేదు. ఇప్పుడు సీరియ‌స్‌గా తీసుకుంటోంది అంశాల‌ను అనిపించింది. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరితే బాగుంటుంది అనిపించింది.

మ‌రో కార‌ణం ఏంటంటే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ప‌దేళ్ల పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా క‌ల్పిస్తాన‌ని మాటిచ్చారు. దానిని తుంగ‌లో తొక్కారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం అధికారంలోకి వ‌స్తే తొలి సంత‌కం ప్ర‌త్యేక హోదాపైనే ఉంటుంద‌ని అంటున్నారు. నేను కాంగ్రెస్‌లో చేర‌డానికి ఇది రెండో కార‌ణంగా చెప్తాను. నేను కాంగ్రెస్‌లో చేరాల‌నుకున్న‌ప్పుడు సోనియా గాంధీ న‌న్ను పిలిచి ఒక్క‌టే చెప్పారు. మా నాన్న వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మీద పెట్టిన కేసు కావాల‌ని చేసింది కాదు అని ప‌రిస్థితుల‌ను వివ‌రించారు.  (YS Sharmila)

మీ అన్న జ‌గ‌న్‌తో మీకున్న స‌మ‌స్య ఏంటి?

మా అన్నతో రాజ‌కీయ‌ప‌రంగానే స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల హ‌క్కుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు, అక్ర‌మంగా భార‌తీయ జ‌న‌తా పార్టీతో పెట్టుకున్న పొత్తుతో స‌మ‌స్య‌లు ఉన్నాయి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తుతో ఉన్నార‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కాక‌పోతే అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదంతే. ప‌దేళ్లుగా భార‌తీయ జ‌న‌తా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఐదేళ్ల పాటు చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ఉండి ఏపీకి ఏమీ చేయ‌లేదు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఏమీ నెరవేర్చ‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీతో క‌లిసి మెలిసి ఉంటున్నారు. ఈ కార‌ణాల వ‌ల్లే నాకు జ‌గ‌న్ అన్న‌తో విభేదాలు ఏర్ప‌డ్డాయి.

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హయాంలో భార‌త్ అభివృద్ధి చెంద‌డంలేదు అంటారా?

ఎలా అంటారు అలా? ఎన్నో అక్ర‌మాలు చూసాం. మోదీ (Narendra Modi) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా కంట్రోల్ చేస్తున్నారంటే ఆయ‌న ఏ రేంజ్‌లో అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారో అర్థం అవుతోంది. మోదీ భార‌త్‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపించ‌డంలేదు అన‌డానికి మ‌ణిపూర్ ఘ‌ట‌నే ఉదాహ‌ర‌ణ‌.

చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్లు భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరుతున్నారు. మ‌రి దానికేమంటారు?

ఎవ‌రికైనా అధికారంలో ఉన్న పార్టీలోనే ఉండాల‌ని ఉంటుంది. ఎవ‌రైతే సీబీఐ, ఈడీ దాడుల నుంచి త‌మ‌ని తాము కాపాడుకోవాల‌ని అనుకుంటున్నారో వారే భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరాల‌నుకుంటున్న‌ట్లు నాకు అనిపిస్తోంది.

ఏపీలో ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంద‌ని అనుకుంటున్నారు?

మేం సాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నాం. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 1.17 శాతం ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఈసారి కాంగ్రెస్ నిల‌దొక్కుకోవ‌డం కాస్త క‌ష్ట‌మే. కానీ అసాధ్యం మాత్రం కాదు.

రేవంత్ తెలంగాణ సీఎం అయ్యారు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి?

రేవంత్ తెలంగాణ ముఖ్య‌మంత్రి అవ్వాలి అనేది దైవ నిర్ణ‌యం. ఇందుకు ఆయ‌న‌కు అభినందన‌లు తెలుపుతున్నాయి. తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చినందుకు సంతోషంగా ఉంది. నా తండ్రి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్ర‌జ‌ల‌కు చాలా చేసారు. ముఖ్య‌మంత్రిగా ఉండి చాలా సాధించారు.

ఏపీలో మీ ప్లాన్ ఏంటి?

నా తండ్రి రాజ‌కీయాన్ని నేను క‌ళ్లారా చూసాను. అది నాకు కూడా సహ‌జంగానే వ‌చ్చింది. నా కోరిక ఒక్క‌టే.. నేను నా తండ్రిలా రాజ‌కీయాల్లో స‌క్సెస్ అవ్వాలి.

వైఎస్ వివేకా భార్య వైఎస్ సౌభాగ్య‌మ్మ క‌డ‌ప నుంచి పోటీ చేస్తున్నారా?

నా చెల్లెలు సునీత రెడ్డి చాలా క‌ష్టాలు ప‌డుతోంది. నిందితులే బాధితుల‌ను నిందితులుగా చూస్తున్నారు. సునీత ఐదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతోంది. సునీతే నిందితురాలు అయితే ఎందుకు న్యాయం కోసం ఇంత‌గా పోరాడుతుంది? మా పిన్ని సౌభాగ్య‌మ్మ క‌డ‌ప‌లో పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని అనుకుంటున్నాను. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే.