Kurchi Thatha: KCR లుచ్చా నా కొడుకు.. రెచ్చిపోయిన కుర్చీ తాత
Kurchi Thatha: ఆ కుర్చీని మడత పెట్టి దె** మెడల్ ఇరిగిపోయినయ్ అనే డైలాగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయారు కుర్చీ తాత. ఇతని అసలు పేరు కాలా పాషా. ఏ ముహూర్తాన ఈ డైలాగ్ వాడాడో తెలీదు కానీ ఈ రోత డైలాగ్‌ను ఏకంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలో ఓ పాటకు వాడేసారు. ఆ పాట కూడా ఈ డైలాగ్ వల్లే తెగ ఫేమస్ అయిపోయింది. ఏదో ఒక డైలాగ్ ఫేమస్ అయిపోయింది కదా అని ఏది మాట్లాడితే అది ఫేమస్ అయిపోతుందని అనుకుంటున్నాడో ఏమో ఈ తాత.. తెలంగాణలో ఉంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి KCR గురించి షాకింగ్ కామెంట్స్ చేసారు. అది కూడా మీడియా ముందు పబ్లిక్‌లో.
ఇప్పటికైతే ఈ తాత పరిస్థితి ఎలా ఉందో తెలీదు కానీ.. మున్ముందు మాత్రం ఇతనిపై దాడి జరిగే అవకాశం కచ్చితంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఈ తాత కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకుని కాంగ్రెస్‌కు సపోర్ట్‌గా నిలబడ్డాడు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి KCR పదేళ్లలో పేద ప్రజలకు మంచి చేసామని చెప్పుకున్నారు మరి మీరు కూడా పేదవారే కదా మీకు మంచి జరిగిందా అని అడిగితే.. నాకు పెన్షన్ కూడా రాలేదు. ఎవరికైనా BRS అంటే అర్థం ఏంటో తెలుసా అని అడిగాడు. అప్పుడు అక్కడున్న ఓ వ్యక్తి భారత రాష్ట్ర సమితి అనగా.. కాదు బాడ్కౌ రాష్ట్ర సమితి అని రెచ్చిపోయారు.
ఏదో ఒక డైలాగ్‌తో ఫేమస్ అయిపోయాం కదా అని ఏం మాట్లాడినా ఎవరూ ఏమీ అనరు అనుకున్నాడో ఏమో KCR గురించి ఇంకా చాలా షాకింగ్ కామెంట్స్ చేసారు. “” KCR ఒక లుచ్చా నా కొడుకు. చెప్పుతో కొడతా. ఆ కుర్చీని మడతపెట్టి దె** మెడల్ ఇరుగుతయ్. నీ ఒంటి మీద వేసుకున్న దుస్తులు కూడా నీ డబ్బుతో కొనలేదు. బీఆర్ఎస్ కాదు కదా దాని తాత ముత్తాతలు వచ్చినా కూడా కాంగ్రెస్‌ను దించి మళ్లీ అధికారంలోకి రాలేరు. కాంగ్రెస్‌ను దించే ధైర్యం ఎవ్వరికీ లేదు. కాంగ్రెస్ బొచ్చు కూడా పీకలేరు. తాగుబోతు సాలే. నా గురించి నీకు ఇంకా తెలీదు. కేటీఆర్ వేసుకున్న దుస్తులు కూడా వాడివి కావు. అమెరికాకు వెళ్లి ఇక్కడి కరెన్సీని అక్కడ వైట్‌గా మార్చుకుని బ్యాంకుల్లో వేసుకుంటున్నావ్ కదరా “” అంటూ ఇష్టా రాజ్యంగా మాట్లాడేసాడు.
అయితే కుర్చీ తాతకు ఇంత ధైర్యం ఎవరిచ్చి ఉంటారు? స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలే ఇలా KCR గురించి మాట్లాడించి ఉంటారన్న టాక్ ఉంది. ఒక సాధారణ రాజకీయ నేత గురించి తప్పుగా మాట్లాడితేనే ఊరుకోరు. అలాంటిది తెలంగాణ మాజీ సీఎంను, ఆయన కుమారుడిని పట్టుకుని ఇంత దారుణంగా తిడితే ఇంకేమైనా ఉందా? ఇప్పటివరకు BRS వర్గాలు ఇంకా కుర్చీ తాతపై ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలియాల్సి ఉంది.