Money: జాబ్ లేకపోయినా మనీ..!
Hyderabad: డబ్బు (money) సంపాదించాలంటే ఉద్యోగమే చేయాల్సిన పనిలేదు. మీలో ఉండే స్కిల్స్‌ని గుర్తించి ఇలా కూడా మనీ (money) సంపాదించుకోవచ్చు. అందరికీ డెస్కుల్లో కూర్చుని 9 టు 5 జాబ్ చేయాలని ఉండదు. కొందరు తమకు నచ్చిన స్కిల్స్‌ను నేర్చుకుని ఇంట్లోనే కూర్చుని డబ్బులు సంపాదిస్తుంటారు. అదెలా అంటే..
బ్లాగింగ్ (blogging)
ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఇలా మీకు ఏ భాషను ఈజీగా టైప్ చేయడం వచ్చో ఆ భాషలో మీకంటూ ఓ బ్లాగ్ ఏర్పాటుచేసుకోండి. ఎలాంటి విషయాల గురించి రాస్తే చదువుతారో కాస్త రీసెర్చ్ చేసి అవే రాయండి. దాని నుంచి మానిటైజేషన్ వస్తుంది.
స్ట్రీట్ ఆర్టిస్ట్ (street artist)
పెయింటింగ్, మ్యూజిక్ అంటే ఇష్టమా? ఒక మంచి ప్రదేశాన్ని చూసుకుని అక్కడ నలుగురికీ మీ కళను చూపించినట్లైతే ఫండ్స్ రూపంలో మనీ వస్తాయి. అయితే ఇండియాలో ఎక్కడపడితే అక్కడ మాత్రం ఎలాంటి ప్రదర్శలు ఇవ్వద్దు. వేరేలా అనుకునే ప్రమాదం ఉంది.
స్పెర్మ్ లేదా ఎగ్ డొనేషన్ (sperm or egg donation)
వినడానికి వింతగా ఉన్నా.. స్పెర్మ్ లేదా ఎగ్ డొనేషన్ చేసేవారికి కొన్ని హాస్పిటల్స్ బాగానే డబ్బులు ఇస్తాయి. పిల్లలు కనలేని వారికి మీరు సాయం చేసినవారు అవుతారు.
ఫొటోగ్రఫీ (photography)
మీకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టమా? అద్భుతంగా ఫొటోలు తీయగలుగుతారా? అయితే కొన్ని వెబ్సైట్లు మీ ఫొటోలు పోస్ట్ చేయడం వల్ల డబ్బులు చెల్లిస్తుంటాయి. వీటిని స్టాక్ ఫొటో వెబ్‌సైట్స్ అంటారు.