Nayanthara: లేడీ సూప‌ర్‌స్టార్ మ‌ల్టీప్లెక్స్ బిజినెస్

Chennai: దాదాపు రెండు దశాబ్దాలుగా కమర్షియల్​, లేడీ ఓరియెంటెడ్​ సినిమాలతో దూసుకెళుతున్న హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara). డైరెక్టర్​ విగ్నేష్ శివన్(Vignesh Shivan) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నయన్​ సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. నయన్​ ప్రస్తుతం తల్లిగా మాతృత్వపు క్షణాలను అనుభవిస్తున్నారు. ఇక పెళ్లి తరువాత కూడా వరుస సినిమాలను లైన్లో పెడుతున్న నయన్ వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. రౌడీ పిక్చర్స్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి నిర్మాతగా మారారు. అంతేకాదు బ్యూటీప్రాడక్ట్స్​ బిజినెస్​లోనూ పెట్టుబడులు పెట్టారు. ఇవే కాకుండా నయన్​ మరో వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. మల్టీప్లెక్స్​ బిజినెస్​లోనూ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
కొన్నిరోజుల క్రితం నయన్- విగ్నేష్ దంపతులు చెన్నైలోని మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్ అగస్త్య ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు హీరోలు మాత్రమే రాణిస్తున్న ఈ బిజినెస్​లో మొట్ట మొదటిసారి అడుగుపెట్టిన హీరోయిన్ గా నయన్ రికార్డుసృష్టించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ అగస్త్య ను నయన్.. మల్టీప్లెక్స్ గా తీర్చిద్దనున్నారు. NV మల్టీప్లెక్స్ పేరుతో చెన్నైలోనే అత్యంత విలాసవంతమైన మల్టీ ప్లెక్స్ గా దీన్ని మార్చనున్నారు. అత్యాధుని హంగులతో ప్రజలు మెచ్చేలా థియేటర్ ను రెడీ చేస్తున్నారట. ఇక తెలుగులో ఇప్పటివరకు మహేష్ బాబు(Mahesh Babu), అల్లు అర్జున్(Allu Arjun), విజయ్ దేవరకొండ(Vijay Deverakonda).. లాంటి స్టార్ హీరోస్ మాత్రమే మల్టిఫ్లెక్స్ లోకి దిగారు. మరి నయన్​ ఈ బిజినెస్​లో ఎలా రాణిస్తుందో చూడాలి!