Zomato: ఇదెక్కడి బ్రేకప్ గొడవరా బాబూ..!
Hyderabad: జొమాటోకి ఓ తలనొప్పి వచ్చి పడింది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు.. ఒక కపుల్ బ్రేకప్ జొమాటో (zomato) చావుకొచ్చింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కి చెందిన అంకిత అనే అమ్మాయి.. రోజూ తన మాజీ ప్రియుడికి ఫుడ్ ఆర్డర్ చేస్తోందట. అందులో తలనొప్పి ఏముంది? వాడు హ్యాపీగా తింటుంటాడు కదా అనుకుంటున్నారా? కానే కాదు. ఫుడ్ ఆర్డర్ పెట్టేటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ సెలెక్ట్ చేసి మరీ ఆర్డర్ చేస్తోందట. దాంతో ఆ అబ్బాయికి రోజూ జొమాటో నుంచి ఫుడ్ వస్తోంది. డెలివరీ బాయ్ వచ్చి బిల్లు ఇంత అయింది సర్ అంత అయింది సర్ అంటూ చంపేస్తున్నాడట.
దాంతో ఇక ఆ అబ్బాయి డబ్బులు ఇవ్వను ఏం చేసుకుంటారో చేస్కోండి అంటున్నాడట. అలా ఫుడ్ మొత్తం వేస్ట్ అయిపోతోంది. దాంతో జొమాటోకి (zomato) ఒళ్లు మండింది. ఎలాగైనా ఈ రచ్చను ఆపాలని నిర్ణయించుకుంది. అయితే అమ్మాయి వివరాలతో సహా పోస్ట్ పెడితే కేసు అవుతుందని “” భోపాల్‌కి చెందిన అంకిత.. దయచేసి మీ మాజీ బాయ్ ఫ్రెండ్‌కి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి మరీ ఫుడ్ ఆర్డర్ చేయకండి. అతను డబ్బులు ఇవ్వను అంటున్నాడు “” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఈ పోస్ట్ కాస్తా వైరల్ అవుతోంది.