Yuzvendra Chahal: ధోనీ ముందుంటే నాకు మాట‌లు రావు

Hyderabad: క్రికెట్ లెజెండ్ మ‌హేంద్ర సింగ్ ధోనీని (ms dhoni) చూడ‌గానే త‌న‌కు మాట‌లే రావు అని అంటున్నారు క్రికెట‌ర్ యుజ్వేంద్ర చాహల్ (yuzvendra chahal). ఓ టాక్ షోలో చాహ‌ల్.. ధోనీతో త‌న‌కున్న అనుబంధం గురించి మాట్లాడారు. ఎవ‌రిని చూస్తే త‌న నోట మాట ఆగిపోతుందో అత‌ను ధోనీ (dhoni) అని అంటున్నాడు. ధోనీ నా ముందు ఉంటే అస‌లు నాకు మాట‌లు రావు. నేను ఎంత హ్యాపీ మూడ్‌లో ఉన్నా కూడా నేను ధోనీ ముందు ఏమీ మాట్లాడ‌లేను. మ‌హీ భాయ్ ఏదైనా అడిగితేనే నోరు తెరిచి మాట్లాడ‌తా. లేదంటే అలా కూర్చుని ఆయ‌న చెప్పేది వింటుంటా అని తెలిపాడు చాహ‌ల్ (yuzvendra chahal).