వక్షోజాలను నారింజలతో పోలుస్తూ….
Yuvraj Singh: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యువీ ఓ క్యాన్సర్ బాధితుడు అని అందరికీ తెలిసిందే. తన లాంటి బాధితుల కోసం ఏదన్నా చేయాలన్న ఉద్దేశంతో యువీ ఓ ఎన్జీవోను ఏర్పాటుచేసాడు. YouWeCan పేరిట ఫౌండేషన్ ఏర్పాటుచేసారు. ఈ నేపథ్యంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఢిల్లీ మెట్రో రైళ్లలో పోస్టర్లు అతికించారు. ఆ పోస్టర్లో వక్షోజాలను నారింజ పండ్లతో పోలుస్తూ పోస్టర్‌ను డిజైన్ చేసారు. దాంతో మెట్రోలో ప్రయాణించిన మహిళలు ఇబ్బందిపడ్డారు. వెంటనే ఫోటో తీసి వక్షోజాలకు కొత్తగా నారింజ పండ్లు అని నామకరణం చేసారా? అంటూ సోషల్ మీడియాలో యువీ సంస్థపై మండిపడుతున్నారు.
దీనిపై దిలీప్ అనే వైద్యుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఆలోచింపజేసే విధంగా ఉంది. అతని తల్లి స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోయారట. ఆమె వక్షోజాల్లో కణతి ఉందని తెలిసీ బయటికి చెప్పుకోవడానికి సిగ్గుపడటం వల్లే ఆమె చనిపోయారని.. ముందే తనకు ఈ విషయం చెప్పి ఉంటే బతికే వారని అన్నారు. కాబట్టి అవయవాలను పండ్లు, కూరగాయలతో పోలుస్తూ సెక్సువలైజ్ చేయకండి అని ఆయన అభ్యర్ధించారు.