YSRCP ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించిన ఓటరు
AP Elections: ఏదో ఒక రచ్చ లేనిదే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు జరగవు. ఇక ఎన్నికల సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు బిక్కు బిక్కుమంటూ ఉంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు గానూ పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శివకుమార్ చేసిన రచ్చ వివాదాస్పదంగా మారింది.
తెనాలి ఎమ్మెల్యే అయిన శివకుమార్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్థానిక పోలింగ్ బూత్‌కి వెళ్లారు. అయితే అక్కడ ఆల్రెడీ ఓటు వేసేందుకు చాలా మంది లైన్లో నిలబడి ఉండగా.. శివకుమార్ లైన్లో కాకుండా ప్రత్యేకంగా వెళ్లి మరీ ఓటు వేసి బయటికి వచ్చారు. ఆ సమయంలో ఓ ఓటరు లైన్లో రావాలి కదా సార్ అని ప్రశ్నించగా.. అందరూ చూస్తుండగానే చెంప చెళ్లుమనిపించాడు. దాంతో ఓటరు కూడా రెచ్చిపోయి ఎమ్మెల్యే చెంప పగలగొట్టాడు. దాంతో శివ కుమార్ వెంటే వచ్చిన కార్యకర్తలు పాపం ఆ ఓటరును చావబాదారు. ఈ తతంగం అంతా స్థానికులు వీడియో తీయడంతో వైరల్‌గా మారింది. విచిత్రం ఏంటంటే.. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లకుండా పోలీసులు స్టేషన్లో ఉంచారు.