Restaurant: ఇక్కడ ఎంత తిన్నా బిల్లు కట్టనక్కర్లేదు!
ఏ రెస్టారెంట్‌లో (restaurant) అయినా ఆర్డర్ చేసుకున్న ఐటెమ్స్‌కి మాత్రమే బిల్లు కడతాం. కానీ ఈ రెస్టారెంట్‌లో మాత్రం అలా కాదు. మీరు ఎంతైనా తినండి. మీరు తన్నదానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఈ రెస్టారెంట్‌లో ఎంత సమయం గడుపుతారో అంత సమయానికి మాత్రమే బిల్లు కడితే సరిపోతుంది. ఇంతకీ ఈ రెస్టారెంట్ ఎక్కడో విదేశాల్లో లేదు. మన ఇండియాలోని కేరళలో (kerala) ఉంది.
ఈ రెస్టారెంట్ పేరు GVQ టైం కెఫె. అథీరా మోహన్ అనే ఆర్టిస్ట్‌కి ఈ ఐడియా వచ్చింది. ఇలా తిన్న తిండికి కాకుండా గడిపిన సమయానికి బిల్లు కట్టే కాన్సెప్ట్ ఆల్రెడీ రష్యాలో ఉంది. కానీ ఇండియాలో ఇలాంటి రెస్టారెంట్ లేదు కాబట్టి ఇక్కడా ఉంటే బాగుంటుందని భావించి కేరళలో ఈ రెస్టారెంట్‌ను ఓపెన్ చేసింది.
2020 నుంచి ఇలాంటి రెస్టారెంట్‌ని ఓపెన్ చేయాలన్న ఆలోచనలో ఉన్న అథీరా ఎన్నో రీసెర్చ్‌లు చేసింది. ఓ రెస్టారెంట్‌లో కొంతకాలం పాటు వెయిట్రెస్‌గానూ పనిచేసింది. అప్పుడే అథీరాక ఒక విషయం అర్థమైంది. కొందరు రెస్టారెంట్ కూర్చోడానికి బాగుందని వస్తుంటారు. వారికి ఆకలి వేయకపోయినా చూసేవారు ఏమనుకుంటారో అని బలవంతంగా ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారట. అలాంటి వారి కోసమే ఈ GVQ టైం కెఫెను ప్రారంభించింది. ఇందుకోసం కేరళలో తన తండ్రి 25 ఏళ్ల క్రితం కొన్ని ఇంటిని తనకున్న ఆర్టిస్ట్ మైండ్‌ను వాడి ఓ అందమైన రెస్టారెంట్‌ను రూపొందించింది. (restaurant)
మరి ఈ రెస్టారెంట్‌లో సమయం గడిపినందుకు ఎంత వసూలు చేస్తారు అనేగా మీ సందేహం. ఇక్కడ గంటకు రూ.150 తీసుకుంటారు. అంతకంటే ఎక్కువ సేపు ఉంటే నిమిషానికి రూపాయి పెరుగుతూ ఉంటుంది. ఈ రెస్టారెంట్‌కు కేరళలో మంచి పాపులారిటీ దక్కింది. ఎంతో మంది ఈ రెస్టారెంట్‌కు వస్తున్నారు. కొన్నిసార్లు అసలు జాగా లేకపోవడంతో గంటల తరబడి బయట వెయిట్ చేస్తుంటారు కూడా. ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది కదూ..!