Restaurant: వెయిటింగ్ పీరియడ్ 4 ఏళ్లు…!
Hyderabad: సాధారణంగా ఎంత ఫేమస్ రెస్టారెంట్స్ (restaurant) అయినా వెయిటింగ్ పీరియడ్ మహా అంటే గంట, లేదా రెండు గంటలు ఉంటుంది. కానీ ఓ రెస్టారెంట్‌లో తినాలంటే మాత్రం ఏకంగా నాలుగేళ్లు ఆగాలట. మీరు చదివింది నిజమే. నాలుగు గంటలు కాదు నాలుగు సంవత్సరాలు. అదేం రెస్టారెంటో అది ఎందుకు అంత స్పెషలో తెలుసుకుందాం. ఆ రెస్టారెంట్ పేరు బ్యాంక్ టావెర్న్. ఇంగ్లాంట్‌లోని బ్రిస్టోల్‌లో ఉంది ఈ రెస్టారెంట్. (restaurant)
ఈ రెస్టారెంట్‌లో సండే ఉండే మెనూలోని ఓ డిష్ చాలా స్పెషల్. ఆ డిష్ కోసమే జనాలు ఓ టేబుల్ రిజర్వ్ చేసుకుని నాలుగేళ్లు వెయిట్ చేస్తారట. ఆ డిష్‌లో అరుదుగా లభించే బీఫ్, సన్న మంటపై వండిన పంది మాంసం, హనీ, రోజ్‌మేరీతో చేసిన మటన్ కలిపి ఒక స్పెషల్ డిష్ వండుతారట. ఇది కేవలం ఆదివారాలు మాత్రమే లభిస్తుంది. సాధారణంగా అయితే ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ నాలుగు నెలలు ఉండేదట. కానీ అది నాలుగేళ్లకు మారడానికి కారణం లాక్ డౌన్. కోవిడ్‌కి ముందు వరకు రిజిస్టర్ చేసుకున్న కస్టమర్స్‌కి టేబుల్ రిజర్వ్ చేసే పనిలో ఉంది ఆ రెస్టారెంట్. ఇక లాక్ డౌన్ తర్వాత రిజిస్టర్ చేసుకున్నవారు చచ్చినట్లు నాలుగేళ్లు ఆగాల్సిందే. (restaurant)
టేబుల్ బుక్ చేసుకున్న వారిలో ఆంబర్ అనే యువతి తన టర్న్ వచ్చేసరికే 3.5 ఏళ్లు అయిపోయాయట. ఎలాగైనా ఈ ఛాన్స్ మిస్సవకూడదు అని ఏకంగా 230 మైళ్లు ప్రయాణించి మరీ ఈ రెస్టారెంట్‌లో ఆ డిష్‌ని టేస్ట్ చేసిందట. ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌లో వెల్లడించింది. అయితే ఈ బ్యాంక్ టావెర్న్ రెస్టారెంట్ కొత్త రిజిస్ట్రేషన్స్ తీసుకోవడంలేదని ప్రకటించేసింది.