2000 Notes: ఈరోజు నుంచే మార్చుకోవచ్చు.. వివరాలు ఇలా!
Hyderabad: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(rbi) విత్‌డ్రా చేసుకోనున్న రూ.2000 నోట్ల(2000 notes) ఎక్స్చేంజ్ ప్రక్రియ ఈరోజు(23 may) నుంచే మొదలైంది. అయితే రూ.2000 నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల్లో ప్రూఫ్‌లు ఏమైనా చూపించాలా అనే అంశంపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. అయితే అలాంటివేమీ అవసరం లేదని ఆర్బీఐ స్పష్టంచేసింది. అయినప్పటికీ బ్యాంకులు ప్రూఫ్‌లు ఏమన్నా అడిగితే ఫిర్యాదులు చేయచ్చు. అయితే మరి కొన్ని బ్యాంకుల్లో రూ.2000 ఎక్స్చేంజ్కి బదులు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారని పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేసారు. బలవంతంగా బ్యాంకులు డబ్బు డిపాజిట్ చేయమంటున్నాయని ఇది సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే భారతీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(sbi) నోట్ల మార్పిడికి ఎలాంటి ప్రూఫ్‌లు అవసరం లేదని చెప్పింది. కానీ కోటక్ మహీంద్రా(kotak mahindra) బ్యాంక్ మాత్రం తమ బ్యాంకులో అకౌంట్ లేని వారిని ప్రూఫ్‌లు సబ్మిట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. సెక్యూరిటీ కారణాల వల్లే ప్రూఫ్ అడుగుతున్నట్లు తెలిపింది. ఇకపోతే పంజాబ్ నేషనల్ బ్యాంక్(punjab national bank) కూడా ఎలాంటి ప్రూఫ్‌లు అవసరం లేదు అని ప్రకటించినప్పటికీ దిల్లీలోని కరోల్ భాగ్ ప్రాంతంలో ఉన్న పీఎన్బీ బ్రాంచ్ ముందు ఐడీ ప్రూఫ్ తప్పనిసరి అని నోటీస్ అతికించి ఉండటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఏ బ్యాంక్ అయినా రూ.2000 నోట్లు ఎక్స్చేంజ్ చేయడానికి కానీ డిపాజిట్ చేయడానికి కానీ ఒప్పుకోకపోతే.. ఖాతా ఉన్న బ్యాంక్‌ను సంప్రందించాలని ఆర్బీఐ వెల్లడించింది. కంప్లైంట్ పెట్టిన 30 రోజుల్లోగా బ్యాంక్ నుంచి ఎలాంటి సమాధానం లేకపోతే.. ఆర్బీఐ (RB-IOS), 2021 స్కీం కింద cms.rbi.org.in వెబ్సైట్ ద్వారా నేరుగా రిజర్వ్ బ్యాంక్‌కే ఫిర్యాదు చేయచ్చు.