232 కోట్ల కారు.. ప్రపంచంలో ముగ్గురి దగ్గరే ఉంది
Car: పై ఫోటోలో ఉన్న కారుని చూసారా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఇది. దీని ధర సుమారు రూ.232 కోట్లు. ప్రపంచంలో కేవలం ముగ్గురి దగ్గరే ఉంది. కానీ ఆ ముగ్గురిలో భారతదేశంలోనే అత్యంత ధనవంతులైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలు మాత్రం లేరు. ఈ కారు విశేషాలేంటో.. ఎవరి దగ్గరుందో తెలుసుకుందాం.
ఈ కారు పేరు రోల్స్ రాయిస్ బోట్ టెయిల్
దీని ధర 28 మిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.232 కోట్లు
1920, 1930ల కాలంలో ఉండే నౌకల డిజైన్ ఆధారంగా దీనిని డిజైన్ చేసారు.
ఈ కారులో అమర్చిన రియర్ డెక్ అవుట్ డోర్ డైనింగ్కి వాడుకోవచ్చు.
ఇందులోనే ఓ టేబుల్, రెండు రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి.
అయితే ఈ రిఫ్రిజిరేటర్లలో కేవలం మందు సీసాలు మాత్రమే పెట్టుకోగలరు.
ఈ కారును డిజైన్ చేయాలంటే 1,813 భాగాలు కావాలి. తయారు చేసేందుకు నాలుగేళ్లు పడుతుంది.
ఈ కారు ప్రపంచంలో కేవలం ముగ్గురి దగ్గరే ఉండటంతో వారికి నచ్చినట్లుగా డిజైన్ చేయించుకున్నారు. అంటే ఆ ముగ్గురు దగ్గరున్న ఈ కారు డిజైన్లు వేరుగా ఉంటాయి. ఒకే మోడల్ కారైనా ఒకేలా ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఇలా డిజైన్ చేసారు.
ఇంతకీ ఈ కారుని ఎవరెవరు సొంతం చేసుకున్నారంటే.. ప్రముఖ అమెరికన్ ర్యాపర్ జే-z దగ్గరుంది. రెండో కారు ఓ ముత్యాల కంపెనీకి చెందిన యజమాని దగ్గరుంది. అయితే అతను తన వివరాలను బహిర్గతం చేయొద్దని కంపెనీతో అగ్రీమెంట్ రాయించుకున్నాడు. ఇక మూడో వ్యక్తి అర్జెంటినాకి చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు మౌరో ఇకార్డీ దగ్గరుంది.