Israel Gaza War: మహిళా సైనికులు నాపై అత్యాచారం చేసారు
Israel Gaza War: ఏడాదిగా జరుగుతున్న ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరిని ఇజ్రాయెల్ సైనికులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే సామాన్య ప్రజల పట్ల ఆడ, మగ అనే తేడా లేకుండా దొరికినవారిపై దొరికినట్లుగా అత్యాచారాలు చేస్తున్నారట. తాజా ఘటనలో ఇజ్రాయెల్ ఆర్మీ ఆధీనంలో 8 నెలల పాటు ఉన్న ఓ యువకుడిని మహిళా సైనికులు అత్యాచారం చేసారట. ఇబ్రహిమ్ సలెం అనే వ్యక్తి 8 నెలల తర్వాత విడుదలై గాజాకు చేరుకున్నాడు. అక్కడి మీడియా వర్గాలతో తన పట్ల ఇజ్రాయెల్ సైనికులు చేసిన అరాచకాలను బయటపెట్టాడు.
తనను మహిళా సైనికులు రేప్ చేయడమే కాకుండా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడాలు, చావబాదడాలు వంటివి చేసారని అన్నాడు. 2023 డిసెంబర్‌లో ఉత్తర గాజాలో ఉన్న కమల్ అడ్వాణ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఇబ్రహీంను ఇజ్రాయెల్ సైనికులు రైడ్లు చేసి మరీ పట్టుకుపోయారు. తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని చెప్తున్నా వినలేదు. అతన్ని ఈడ్చుకెళ్లి రెండు రోజుల పాటు నగ్నంగా వర్షంలో తడిసేలా చేసారు. తిండి, దుస్తులు ఇవ్వడానికి రెండు రోజుల పాటు ఎదురుచూసామని అన్నాడు. దాదాపు 52 రోజుల పాటు తనను ఇతర గాజా ప్రజలను దారుణంగా తిడుతూ కొడుతూ అత్యాచారాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసాడు. చాలా మంది మగవారికి మహిళా సైనికులు అత్యాచారం చేయడం వల్ల అంగ భాగం దెబ్బతిందని తెలిపాడు. ఇతని విషయం బయటికి రావడంతో కచ్చితంగా ఇజ్రాయెల్ దీనికి సమాధానం చెప్పి తీరాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.