Israel Gaza War: యుద్ధ భూమిలో ఆడ పులులు..!
ఇజ్రాయెల్ గాజా (israel gaza war) మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆడవారు కూడా ఉన్నారు. కొందరు యుద్ధంలో సైనికులుగా పోరాడుతుంటే.. మరికొందరు అక్కడి వార్తలను ఎప్పటికప్పుడు అందజేస్తూ.. దాడుల వల్ల గాయపడినవారికి చికిత్సలు అందిస్తున్నవారు కొందరు. ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF) యుద్ధంలో ధైర్యంగా పోరాడుతున్న ఆడవారి ఫోటోలు వీడియోలను షేర్ చేసింది. యుద్ధ భూమిలో ఎంతో ధైర్యంతో అక్కడి పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆడ పులులు వీరే..!
మోరియా మెన్సర్
మాజీ IDF సైనికురాలు మోరియా మెన్సర్.. ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడిలో తన ప్రాణ స్నేహితురాలిని కోల్పోయింది. ఆ కోపంతో హమాస్‌ను ఎదుర్కొనేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా హమాస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇజ్రాయెల్ వెళ్లింది. లండన్‌లోని హెత్రో ఎయిర్‌పోర్ట్ నుంచి మోరియా ఓ వీడియో పోస్ట్ చేసింది. “” ఇజ్రాయెల్‌లో నా స్నేహితులు చిక్కుకున్నారు. వారిలో కొందరు మిస్సింగ్ అని తెలిసింది. మరో స్నేహితురాలిని చంపేసినట్లు తెలిసింది. అందుకే లండన్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్నాను “” అని వీడియోలో పేర్కొంది. (israel gaza war)
ఎల్లా వావేయా
ఈమె IDFలో మేజర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా ముస్లిం అరబ్. ఈమెను ప్రపంచవ్యాప్తంగా కెప్టెన్ ఎల్లా అని పిలుస్తారు. ఎప్పటికప్పుడు ఎల్లా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇజ్రాయెల్‌లోని పరిస్థితులను తన ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంటున్నారు.
లిరోన్
శనివారం దక్షిణ ఇజ్రాయెల్‌లో జరుగుతున్న ఓ మ్యూజిక్ ఫెస్టివల్‌కు లిరోన్ అనే మహిళ తన భర్తతో కలిసి వెళ్లింది. అదే సమయంలో హమాస్ ఒక్కసారిగా మెరుపు దాడులు చేసింది. ఆ దాడుల నుంచి లిరోన్ దంపతులు ఎలాగోలా తప్పించుకున్నారు. వెంటనే వీరిద్దరూ ప్రజలను కాపాడేందుకు కంబాట్ ఇంజినీరింగ్ కార్ప్స్ రిజర్వ్ బెటాలియన్‌లో చేరారు.
ప్లెస్తియా అలాకాద్
ఈమె పాలెస్తీనాకు చెందిన జర్నలిస్ట్. తన చుట్టూ జరుగుతున్న భీకర దాడులను ఎప్పటికప్పుడు తన ఫోన్ ద్వారా వీడియోలు తీస్తూ ప్రపంచానికి తెలియజేస్తోంది. అప్పటివరకు ఓ సాధారణ మహిళలా చూసిన ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు గాజా ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు షేర్ చేయడంతో తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా మూడింతలు పెరిగిపోయింది. ఎందరో నెటిజన్లు ఆమె ధైర్య సాహసాలను ప్రశంసిస్తున్నారు. (israel gaza war)
మికి డుబెరీ
23 ఏళ్ల మికి అమెరికాకు చెందిన జర్నలిస్ట్. ఆమె రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బదిలీ అయ్యింది. యుద్ధం తర్వాత వందలాది మంది బాధితుల నుంచి సమాచారం సేకరించి తనకు తోచిన సాయం చేస్తోంది. అంతర్జాతీయ మహిళా మీడియా ఫౌండేషన్ ప్రకారం.. ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో దాదాపు ఏడుగురు జర్నలిస్ట్‌లు హతమయ్యారు.