మందులు కొనడానికి వెళ్లి.. కొండచిలువ నోట్లో శవంగా మారి..!
Indonesia: ఓ యువతి తన బిడ్డకు ఒంట్లో బాలేదని మందులు తేవడానికి బయటికి వెళ్లగా.. కొండచిలువకు చిక్కి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఇండోనేసియాలో చోటుచేసుకుంది. స్థానిక దక్షిణ సులవాసి ప్రాంతంలో నివసిస్తున్న సిరియాటి అదియాంసా దంపతులకు ఓ బాబు ఉన్నాడు. బాబుకి ఒంట్లో బాలేకపోవడంతో సిరియాటి స్థానిక మందుల షాపుకి వెళ్లింది. అలా వెళ్లిన ఆమె ఎంత సేపైనా తిరిగి రాలేదు.
దాంతో అదియాంసా పక్కింటి వారితో కలిసి సిరియాటి కోసం వెతకడానికి వెళ్లగా.. ఆమె చెప్పులు దుస్తులు ఓ చోట పడి ఉండటం గమనించారు. ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టగా.. ఓ కొండచిలువ కడుపు ఉబ్బిపోయి ఉండటం గమనించారు. అనుమానంతో దాని కడుపు చీల్చి చూడగా.. సిరియాటి లోపల శవంగా కనిపించింది. ఇలాంటి ఘటన ఇండోనేసియాలో నెలకు ఒకటి రెండు జరుగుతూనే ఉంటాయని స్థానికులు చెప్తున్నారు.