Marriage With Doll: బొమ్మతో పెళ్లి.. ఆపై కవలలు..!
Marriage With Doll: పిచ్చోళ్ల గురించి వినడమే కానీ చూడటం ఇదే మొదటిసారి అని గురూజీ బ్రహ్మానందం అంటే ఏంటో అనుకున్నాం కానీ ఇలాంటివారు నిజంగానే ఉన్నారండోయ్. ఓ మహిళ ఏకంగా తన ఇంట్లో దొరికిన బొమ్మను పెళ్లి చేసుకోవడమే కాదు.. దానితో కవలలను కూడా కనింది. ఈ విచిత్ర ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది.
ఇంతకీ ఈ విచిత్రమైన లవ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. బ్రెజిల్‌కి చెందిన రోచా అనే 39 ఏళ్ల మహిళకు ఒక తోడు లేదు. దాంతో తన తల్లికి చెప్పుకుని బాధపడుతూ ఉండేది. దాంతో రోచా తల్లికి ఓ ఆలోచన వచ్చింది. మగాడి సూట్‌లో కనిపించే ఓ బొమ్మను తయారుచేసి సరదాగా రోచాకు ఇచ్చింది. కొంతకాలం పాటు ఆ బొమ్మను తన బెస్ట్‌ఫ్రెండ్‌లా చూసుకునేది. దానికి మార్సెలో అని పేరు కూడా పెట్టింది. కొన్ని రోజుల తర్వాత ఆ బొమ్మనే పెళ్లి చేసుకుంటానని రోచా తన తల్లితో చెప్పింది. దాంతో ఆమె షాకైంది. ఇప్పుడు కాదంటే ఎక్కడ తన కూతురు పిచ్చిది అయిపోతుందో అని భయపడి పెళ్లికి ఒప్పుకుంది. అలా తన కుటుంబంలోని 350 మంది అతిథులను పిలిచి గ్రాండ్‌గా బొమ్మను పెళ్లి చేసుకుంది రోచా.
ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఆ బొమ్మ ద్వారా రోచాకు కవలలు పుట్టారట. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఏముంది.. రెండు పిల్లల బొమ్మలను తయారు చేయించుకుని వాటినే తన పిల్లలుగా చూసుకుంటోంది రోచా. తన వైవాహిక జీవితం ఎంతో బాగుందని.. ఇతర అబ్బాయిల్లా మార్సెలో తనతో గొడవపడటం.. తనను బాధపెట్టడం వంటివి అస్సలు చేయడని అంటోంది. దీనికి ఇప్పుడు పిచ్చి ఏ రేంజ్‌లో ఉందంటే.. పిల్లలను తానే స్వయంగా కన్నట్లు లైవ్ స్ట్రీమింగ్ చేయించింది. దాంతో రోచా కుటుంబీకులు, ఫ్రెండ్స్ ఆమెకు పిచ్చి పట్టింది అనుకుంటున్నారు. తాను పెళ్లి చేసుకుంది ఒక బొమ్మను అని ఎవరు ఎన్ని సార్లు చెప్పినా వినడంలేదట. మార్సెలో తన భర్త అని.. అలాంటి మోసం చేయని భర్త కోసం ఎంతో మంది ఆడవారు బయట ఎగరేసుకుపోవాలని చూస్తున్నారని అంటోందట.