Etihad: యువ‌తితో జిందాల్ టాప్ ఉద్యోగి అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌.. పోర్న్ చూపిస్తూ..

woman was teased by jindal steel top executive on etihad airways

Etihad: ఎతిహాద్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఓ విమానంలో జిందాల్ స్టీల్స్ సంస్థ‌కు చెందిన టాప్ ఉద్యోగి ఒక‌రు తోటి ప్ర‌యాణికురాలి ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. దినేష్ సరౌగీ అనే ఉద్యోగి.. కల‌క‌త్తా నుంచి అబుదాబికి ఎతిహాద్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానంలో ప్ర‌యాణిస్తున్నాడు. అదే విమానంలో ఓ మ‌హిళ దినేష్ ప‌క్క సీటులోనే కూర్చుంది. ఆ స‌మ‌యంలో దినేష్ ఆ మ‌హిళ‌కు పోర్న్ వీడియోలు చూపించి ఆమెను ద‌గ్గ‌రికి తీసుకోబోయాడు. దాంతో వెంట‌నే ఆమె సిబ్బందికి విష‌యం చెప్ప‌డంతో వారు వెంట‌నే ఆమెను సుర‌క్షితంగా వేరే సీటులోకి తీసుకెళ్లారు.ఈ విష‌యాన్ని ఆ యువతి ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డిస్తూ త‌న‌ను స‌మ‌యానికి ర‌క్షించిన ఎతిహాద్ సిబ్బందికి ధ‌న్య‌వాదాలు తెలిపింది.