Viral News: న‌డిరోడ్డుపైకి న‌గ్నంగా వ‌చ్చేసిన యువ‌తి

woman walks naked on streets in ghaziabad

Viral News: ఓ యువ‌తి న‌డిరోడ్డు మీద‌కి న‌గ్నంగా వ‌చ్చి తిరిగిన ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానిక మోహ‌న్ న‌గ‌ర్ చౌరాహా అనే ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆ మ‌హిళ అలా దుస్తుల్లేకుండా అన్నీ విప్పేసి రోడ్డుపై న‌డుస్తుంటే స్థానికులు నోరెళ్లబెట్టి చూసారే త‌ప్ప లాగి రెండు పీకి దుస్తులు వేయించ‌లేక‌పోవ‌డం బాధాక‌రం. పైగా వీడియోలు తీసి సోష‌ల్‌మీడియాలో షేర్ చేసారు. అయితే ఆమె ఇలా ఎందుకు చేసిందో మాత్రం తెలియ‌రాలేదు. సోష‌ల్ మీడియాలోకి వీడియో రావ‌డంతో స్థానిక పోలీసులు అలెర్ట్ అయ్యారు. వెంట‌నే వీడియోను తీయించేసారు. వెంట‌నే ఆ అమ్మాయి ఎవ‌రో ఏంటో తెలుసుకుని సుర‌క్షితంగా ఓ ప్ర‌దేశానికి త‌ర‌లించేందుకు పోలీసులు య‌త్నిస్తున్నారు.