అగ్నిమాపక సిబ్బందిని లోబర్చుకోవాలని.. కార్చిచ్చు రాజేసిన మహిళ
Viral News: అగ్నిమాపక సిబ్బందిని ఊరించి తన వల్లో వేసుకోవాలని చూసింది ఓ మహిళ. ఇందుకోసం విచిత్రమైన ప్లాన్ వేసింది. కావాలనే తన నివాసంలోని పరిసర ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో కార్చిచ్చు రాజేసింది. ఈ ఘటన గ్రీస్‌లో చోటుచేసుకుంది. ట్రిపోలి ప్రాంతానికి చెందిన 44 ఏళ్ల మహిళ.. ఎలాగైనా తన లైంగిక వాంఛలు తీర్చుకోవాలని అనుకుంది. ఇందుకోసం ఓ విచిత్రమైన ప్లాన్ వేసింది. కార్చిచ్చు రాజేస్తే వెంటనే అగ్నిమాపక సిబ్బంది వస్తారని.. వారిని వల్లో వేసుకుని తన కోరిక నెరవేర్చుకోవాలని అనుకుంది.
ఇందుకోసం ఒకటి కాదు రెండుసార్లు కార్చిచ్చు రాజేసింది. అయితే కార్చిచ్చు రాజుకున్న ప్రతిసారీ ఆమె నుంచే కాల్స్ రావడంతో అగ్నిమాపక సిబ్బందికి అనుమానం వచ్చింది. దాంతో మూడోసారి ఇలా జరగకుండా ఆమెపై నిఘా వేసారు. ఆమె మూడోసారి కూడా కార్చిచ్చు రాజేయాలనుకోవడంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మహిళను కోర్టులో ప్రవేశపెట్టగా రూ.90 వేలు జరిమానా విధించింది. గ్రీస్‌లోని ఏథెన్స్ ప్రాంతం కార్చిచ్చు ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆ మహిళ ఇలాంటి కుట్రకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది.