లిఫ్ట్ ఇచ్చి పోలీస్‌నే రేప్ చేసాడు
Police: లిఫ్ట్ ఇచ్చినట్లే ఇచ్చి ఏకంగా మహిళా పోలీస్‌నే అత్యాచారం చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కాన్పూర్‌కి చెందిన ఓ మహిళ కర్వా చౌత్ పండుగ కావడంతో నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో ధర్మేంద్ర పాస్వాన్ అనే వ్యక్తి రండి మేడం లిఫ్ట్ ఇస్తాను అని బైక్ ఎక్కించుకున్నాడు. త్వరగా ఇంటికి వెళ్లచ్చు అనే ఉద్దేశంతో ఆమె బైక్ ఎక్కింది. అతను వెళ్లాల్సిన రూట్‌లో కాకుండా వేరే రోడ్డు వైపు వెళ్తుండడం గమనించిన ఆ మహిళ అనుమానం వచ్చి బైక్ ఆపమని రచ్చ చేసింది. అయినా అతను వినలేదు.
అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి వేలు కొరికేసి ఆమె పారిపోయి పోలీసులను ఆశ్రయించింది. తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న భయంతో నిందితుడు పాస్వాన్ కావాలనే మరో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తన బైక్ పోయిందని ఫిర్యాదు చేసాడు. ఈ కేసు విషయంలో పాస్వాన్‌ను ఓ రోజు స్టేషన్‌కు రావాలని పోలీసులు ఆదేశించారు. పాస్వాన్ వెళ్లగానే అక్కడే ఉన్న బాధితురాలు తనపై అత్యాచారం చేసింది ఇతనే అని అతనిపై దాడికి దిగింది. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.