Viral News: భర్తను వదిలేసి మేనకోడలితో మహిళ వివాహం
Viral News: ఓ మహిళ భర్తను వదిలేసి మేనకోడలిని పెళ్లి చేసుకున్న ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. గోపాల్‌గంజ్ జిల్లాకు చెందిన ఆ ఇద్దరు మేనత్తా మేనకోడళ్లు మూడేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారట. ఆమెకు ఆడవాళ్లంటే ఇష్టం అని తెలీక ఇంట్లో వారు మగాడికి ఇచ్చి పెళ్లి చేసారు. కానీ ఆమెకు ఆ పెళ్లి ఇష్టం లేదు. అలా మూడేళ్ల పాటు మేనకోడలితో ప్రేమాయణం సాగించిన ఆ మహిళ ఎట్టకేలకు ఈరోజు భర్తను వదిలేసి తన మేనకోడలిని పెళ్లి చేసుకుంది. సాధారణ పెళ్లి లాగే మేనకోడలి మెడలో తాళి కట్టి ఏడడుగులు వేసింది. సమాజం ఏమన్నా కూడా తమ బతుకు తాము బతకాలని అనుకుంటున్నామని వారు అంటున్నారు.