Tomato కర్రీ చేసిన భర్త.. అలిగి వెళ్లిపోయిన భార్య
Bhopal: టమోటాల ధర రోజురోజుకీ పెరిగిపోతుంది. ప్రస్తుతం కిలో టామోటా (tomato) ధర రూ.200 వరకు ఉంది. దాంతో మధ్య తరగతి ప్రజలు టమోటాలు (tomato) కొనుక్కోవాలంటేనే భయపడుతున్నారు. అయితే ఈ టొమాటో దంపతుల మధ్య చిచ్చు పెట్టే దాకా వెళ్తుందని ఎవ్వరూ ఊహించలేదు. మధ్యప్రదేశ్‌లోని షాదోల్ జిల్లాకు చెందిన సంజీవ్ టిఫిన్ సెంటర్ పెట్టుకుని జీవిస్తున్నాడు. అయితే నిన్న చట్నీలోకి ఇంట్లో నుంచి రెండు టమోటాలు తెచ్చి వండాడట. ఈ విషయం సంజీవ్ భార్యకు చెప్పాడట. అసలే ధరలు మండిపోతుంటే టమోటాలతో చట్నీ చేసినందుకు ఆమెకు ఒళ్లు మండిపోయింది. దాంతో సంజీవ్‌తో పెద్ద గొడవపెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
వెళ్తూ తన కూతురిని కూడా తీసుకెళ్లిపోయింది. సంజీవ్ ఎన్నిసార్లు సారీ చెప్పి బతిమాలినా ఆమె కరగలేదు. అయితే తన భార్య పుట్టింటికే వెళ్లిందని సంజీవ్ అనుకున్నాడు. దాంతో తన అత్తింటివారికి ఫోన్ చేసి కనుక్కున్నాడు. వాళ్లు రాలేదు అని చెప్పారట. దాంతో ఊరంతా వెతికినా భార్య, బిడ్డ కనిపించకపోయేసరికి సంజీవ్ స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాడు. త్వరలో తన భార్యను వెతికి క్షేమంగా ఇంటికి పంపిస్తామని చెప్పి సంజీవ్‌కు ధైర్యం చెప్పి పంపించారు.