Budwel: రేప్ చేయాలని చూసాడు.. కొట్టి చంపేసింది
Budwel: ఇంట్లో ఎవరూ లేరని తెలిసి ఓ మహిళపై రేప్ అటెంప్ట్ చేయబోయిన వ్యక్తిని చితకబాది చంపేసింది ఆ మహిళ. ఈ ఘటన తెలంగాణలోని (telangana) బద్వేల్‌లో (budwel) చోటుచేసుకుంది. జయమ్మ అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉందని తెలిసి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈరోజు తెల్లవారుజామున తప్పతాగి తన ఇంటి తలుపులు తట్టాడు. జయమ్మ తలుపులు తెరవగానే ఇంట్లోకి ప్రవేశించి ఆమెను బలవంతం చేయబోయాడు. తాగిన మైకంలో రెచ్చిపోయిన శ్రీనివాస్‌ను జయమ్మ పక్కనే ఉన్న ఇనుప రాడ్‌తో తలపై బాదింది. బ్లీడింగ్ ఎక్కువ అవడంతో అతను స్పాట్‌లో చనిపోయాడు. ఆ సమయంలో సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.