బ‌ర్త్‌డేకి దుబాయ్ తీసుకెళ్ల‌లేద‌ని భ‌ర్త‌ను చేత్తో గుద్ది చంపేసింది!

Crime News: బ‌ర్త్‌డే సంద‌ర్భంగా త‌న‌ను దుబాయ్ ట్రిప్‌కి తీసుకెళ్ల‌లేద‌ని ఓ మ‌హిళ భ‌ర్త‌ను గుద్ది చంపేసింది. ఈ దారుణ ఘ‌ట‌న పుణెలో (pune) చోటుచేసుకుంది. వ‌నావ్డీ ప్రాంతానికి చెందిన నిఖిల్ ఖ‌న్నా బ‌డా వ్యాపారవేత్త‌. నిన్న ఇత‌ని భార్య రేణుక పుట్టిన‌రోజు. అయితే బ‌ర్త్‌డేకి దుబాయ్‌కి తీసుకెళ్ల‌మ‌ని ఎప్ప‌టినుంచో అడుగుతోంది. కానీ నిఖిల్ ప‌నులలో బిజీగా ఉండ‌టంతో ఆమెను దుబాయ్‌కి తీసుకెళ్ల‌లేక‌పోయాడు. ఖ‌రీదైన కానుక‌లు కూడా ఇవ్వ‌లేద‌ని ఆమె కోప‌గించుకుంది.

అలా భ‌ర్త‌తో గొడ‌వ‌పెట్టుకుంది. కోపంలో త‌న భ‌ర్త ముక్కుపై గుద్దింది. ఆమె ఎంత గ‌ట్టిగా గుద్దిందంటే దెబ్బ‌కి పళ్లు కూడా ఊడిపోయాయ‌ట‌. ముక్కుకి తీవ్ర గాయం కావ‌డంతో నిఖిల్ చికిత్స పొందుతూ చ‌నిపోయాడు. పోలీసులు రేణుక‌ను అదుపులోకి తీసుకున్నారు. పైగా వీరిద్ద‌రూ ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.