అయ్యో పాపం.. 2 రోజులు ప్రయాణించి గుడికెళ్లిన యువతికి షాక్
Temple: సోషల్ మీడియాలో చూసిన ప్రతీ ప్రదేశానికీ వెళ్లాలని మనసు ఉవ్విళ్లూరుతుంది. చాలా మంది ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా వారు వెళ్లిన ప్రదేశాలను వీడియోలు తీసి ఈ ప్రదేశం ఇంత బాగుంది అంత బాగుంది అని ఊరిస్తుంటారు. అలా సోషల్ మీడియాలో చూసిన ఓ ఆలయానికి వెళ్లాలనుకున్నారు ఇద్దరు పర్యాటకులు. తీరా వెళ్లేసరికి అక్కడ ఉన్న ఆలయం రూపు రేఖలు చూసి బిత్తరపోయారు. అసలేం జరిగిందంటే.. రేచెల్, లారెన్ అనే ఇద్దరు పర్యాటకులు సోషల్ మీడియాలో జపాన్‌లోని సైగాంటో జీ పగోడా ఆలయం ఫోటోలను చూసారు. ఆ ఆలయం చూడగానే వారికి ఎంతో నచ్చింది. దాంతో ఎలాగైనా అక్కడికి చేరుకోవాలనుకున్నారు.
అన్నీ ప్లాన్ చేసుకుని ఇద్దరూ రెండు రోజుల పాటు ప్రయాణించి జపాన్‌లోని ఆ ఆలయానికి చేరుకున్నారు. ఈ ఆలయం నుంచి నాచీ వాటర్ ఫాల్స్ కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే అక్కడ మంచు కమ్మేసి ఉండటంతో మూడు రోజులు వాతావరణం కాస్త క్లియర్ అయ్యే వరకు ఎదురుచూసారు. తీరా వెళ్లి చూసేసరికి అక్కడ వారు ఊహించుకున్నట్లుగా ఆలయ గోపురం లేదు. ఆ గోపురం కేవలం కార్డ్‌బోర్డుతో కప్పేసి ఉంది. ఎందుకంటే అక్కడ నిర్మాణం జరుగుతోందట. దాంతో పాపం వారికి షాక్‌ని మిగిల్చింది. ఆ ఆలయానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఏదో అనుకుని వెళ్తే ఏదో జరిగింది అంటూ అసంతృప్తిని వెళ్లబుచ్చారు. ఇతర పర్యాటకులను కూడా వెళ్లద్దని హెచ్చరించారు. ఈ పోస్ట్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల్లో వ్యూస్, లైక్స్ వచ్చాయి. ఇప్పటికైనా సోషల్ మీడియాలో కనిపించే ప్రతీదీ నమ్మి వెళ్లద్దంటూ కామెంట్స్ పెడుతున్నారు.