Viral News: వ‌క్షోజాల‌పై మురుగ‌న్ టాటూ.. త‌మిళ‌నాడులో ర‌చ్చ‌

woman gets murugan painting on her breast

Viral News: త‌మిళ‌నాడుకి చెందిన ఓ యువ‌తి చేసిన సిగ్గుమాలిన ప‌నికి అక్క‌డ ర‌చ్చ రాజుకుంది. త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు ఎంతో భ‌క్తితో కొలిచే మురుగ‌న్ (సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి) బొమ్మ‌ను ఏకంగా వ‌క్షోజాల‌పై టాటూగా వేయించుకుంది. తాను అలా టాటూ వేయించుకున్న‌ట్లు ఆ యువ‌తి వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వివాదాస్ప‌దంగా మారింది. కొంద‌రేమో ఆ యువ‌తిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం అబ్బాయిలు అలా టాటూలు వేయించుకుని తిరిగితే అబ్బా ఎంత భ‌క్తి అంటార‌ని.. అదే ప‌ని అమ్మాయి చేస్తే త‌ప్పేంట‌ని ఆమెకు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ వీడియోను సోష‌ల్ మీడియా నుంచి తొల‌గించేందుకు పోలీసులు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.