వేరే రాష్ట్రంలో భర్త ఉద్యోగం.. మరిదిని పెళ్లి చేసుకున్న మహిళ
Viral News: ఓ పక్క భర్త వేరే రాష్ట్రంలో కుటుంబం కోసం కష్టపడుతుంటే.. అతని భార్య ఏకంగా భర్త సోదరుడినే రహస్యంగా పెళ్లి చేసేసుకుంది. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. సివాన్ జిల్లాకు చెందిన సంగీత అనే యువతి 2018లో నందకిశోర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతనితో పాప, బాబుని కనింది. ఈ నేపథ్యంలో నందకిశోర్ ఉద్యోగ రిత్యా వేరే రాష్ట్రానికి వెళ్లడంతో సంగీత భర్త సోదరుడైన కృష్ణతో ఎఫైర్ పెట్టుకుంది. ఇక నందకిశోర్ ఎటూ ఇంటికి రాడులే అనే ధీమాతో వీరిద్దరూ దగ్గర్లోని ఓ ఆలయానికి వెళ్లి ఏకంగా పెళ్లి చేసేసుకున్నారు.
దాంతో స్థానికులు వెంటనే ఈ విషయాన్ని నందకిశోర్‌కు తెలిసేలా చేసారు. అతను హుటాహుటిన బిహార్‌కు బయలుదేరినట్లు తెలుస్తోంది. ఎక్కడ నందకిశోర్ తమను విడగొడతాడో అని భయపడి సంగీత, కృష్ణ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ముందస్తు ఫిర్యాదు చేసారు.