Divorce: నటుడ్ని ప్రేమిస్తున్నా అనుకుని.. చివరికి..
పాపం.. ఏదో వెబ్‌సైట్‌లో పరిచయం అయిన వ్యక్తి నటుడు అనుకుని అతనితో ప్రేమాయణం సాగించింది. అతని కోసం కట్టుకున్న భర్తకు కూడా విడాకులు ఇచ్చేసింది. చివరికి అతను నటుడు కాదు స్కామర్ అని తెలిసి మోసపోయిన మహిళ కథ ఇది. బ్రెజిల్‌కి (brazil) చెందిన కాలా అనే మహిళ కొన్ని రకాల సినిమాలు తీసింది. అయితే కాలాకి వివాహం అయినప్పటికీ తనకు ఓ వెబ్‌సైట్‌లో పరిచయం అయిన వ్యక్తిపై ప్రేమ పెంచుకుంది. ఆ వెబ్‌సైట్ హాలీవుడ్ ఫేమస్ వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్‌లో (stranger things) నటించిన డాకర్ మోంట్గోమెరేకి (dacre montgomery) చెందినదట. దాంతో తనతో మాట్లాడేది కూడా నటుడు డాకరే అనుకుని దాదాపు ఏడాది పాటు మాట్లాడుతూ వచ్చింది. అతని మాయలో పడిపోయి కాలా తన భర్తకి కూడా విడాకులు ఇచ్చేసింది. (divorce)
ఏడాది తర్వాత ఓసారి కలుద్దామని వెబ్‌సైట్‌లో పరిచయం అయిన వ్యక్తి అడిగాడట. కానీ ఈ విషయం ఎక్కడా చెప్పద్దు మీడియా వాళ్లకు తెలిస్తే వార్తలు రాసేస్తారు అని అన్నాడట. ఇందుకు ఆమె కూడా ఓకే అనింది. కలుద్దాం అని చెప్పిన వ్యక్తి ఈరోజు కలుద్దాం రేపు కలుద్దాం అని చెప్తూ వచ్చాడు కానీ అసలు కలవనేలేదట. ఈ గ్యాప్‌లో అతనికి వందల డాలర్లు విలువైన గిఫ్ట్స్ పంపుతూ ఉండేదట. ఓసారి ఆ వ్యక్తి తనకు డబ్బు అవసరం ఉందని, తన బ్యాంక్ అకౌంట్స్ తన గర్ల్‌ఫ్రెండ్ చూసుకుంటోందని, ఇప్పుడు తనకు విషయం తెలిస్తే డబ్బు మొత్తం తీసేసుకుంటుదని ఏవేవో చెప్పి నమ్మబలికాడు. నిదానంగా తన గర్ల్‌ఫ్రెండ్‌ని వదిలించుకుని పెళ్లి చేసుకుందాం అని కూడా అన్నాడట. అది నమ్మి కాలా తన దగ్గర ఉన్న దాదాపు 8 లక్షల వరకు డబ్బు అతనికి పంపింది. (divorce)
రోజులు గడుస్తున్నాయి కానీ ఆ వ్యక్తి కాలాను కలవడానికి రావడంలేదు. దాంతో ఆమెకు సందేహాలు మొదలయ్యాయి. ఆరా తీస్తే అతను తను అనుకుంటున్నట్లు యాక్టర్ కాదని స్కామర్ అని తెలిసింది. దాంతో వెంటనే అతనికి సంబంధించిన కాంటాక్ట్స్ అన్నీ డిలీట్ చేసేసింది. అటు కట్టుకున్న భర్తను వదులుకుని మోసపోయానని తెగ బాధపడుతోంది కాలా. (divorce)