సెక్స్ వల్ల రక్తస్రావం.. చనిపోయిన యువతి
Sex: ప్రియుడితో సెక్స్ చేసాక ఓ యువతి తీవ్ర రక్తస్రావంతో చనిపోయిన ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌కి చెందిన 23 ఏళ్ల నర్సింగ్ విద్యార్థి తన ప్రియుడితో కలిసి నవసరి జిల్లాలోని ఓ హోటల్‌కు వెళ్లింది. అక్కడ వారిద్దరూ లైంగికంగా కలిసారు. అయితే సెక్స్ తర్వాత ఆ యువతి యోని భాగం నుంచి తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లకుండా కనీసం అంబులెన్స్‌కి కాల్ చేయకుండా రక్తస్రావం ఎలా ఆపాలో యూట్యూబ్‌లో చూస్తూ టైం వేస్ట్ చేసాడు. అప్పటికే బాగా రక్తం పోవడంతో ఆ అమ్మాయి కళ్లు తిరిగి పడిపోయింది. దాంతో ఆ యువకుడు భయమని హోటల్ సిబ్బందిని పిలిచి దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి రమ్మన్నాడు. వారు హాస్పిటల్‌కు చేరుకునే సమయానికే ఆ అమ్మాయి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దాంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.