Divorce: మేం విడిపోయాం.. పెళ్లి వీడియో డబ్బులు ఇచ్చేయండి
Hyderabad: ఓ మహిళ వెడ్డింగ్(wedding) వీడియోగ్రాఫర్‌తో చేసిన చాటింగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన భర్తతో విడిపోవడంతో(divorce).. పెళ్లి సమయంలో వీడియో కోసం ఇచ్చిన డబ్బులు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేసింది. ఈ ఘటన సౌత్ ఆఫ్రికాలో చోటుచేసుకుంది. నాలుగేళ్ల క్రితం ఓ మహిళ తన భర్తతో కలిసి వెడ్డింగ్ ఫొటోషూట్ తీయించుకుంది. ఆ సమయంలో వారికి డర్బన్‌కు చెందిన రోమియో అనే వీడియోగ్రాఫర్ ఫొటోలు, వీడియోలు తీసాడు. అయితే ఇప్పుడు ఆ మహిళ తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. దాంతో రోమియో నెంబర్ తెలుసుకుని అతనికి వాట్సాప్‌లో మెసేజ్‌లు చేసింది.
హాయ్ రోమియో.. నీకు నేను గుర్తున్నానో లేదో తెలీదు కానీ నాకు మాత్రం నువ్వు బాగా గుర్తున్నావ్. ఎందుకంటే నాలుగేళ్ల క్రితం డర్బన్‌లో నా పెళ్లి ఫొటోలు, వీడియోల కాంట్రాక్ట్ నువ్వు తీసుకున్నావ్. నువ్వు చాలా బాగా వీడియోలు తీసావ్. కాకపోతే ఇప్పుడు మేము విడిపోయాం. కాబట్టి ఆ వీడియోలు, ఫొటోలు మాకు అవసరం లేదు. వాటి కోసం మేం నీకు చెల్లించిన డబ్బు మొత్తం రీఫండ్ చేస్తావని ఆశిస్తున్నా అని వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టారు. అది చూసి రోమియో షాకయ్యాడు. డబ్బు మాత్రం రీఫండ్ చేయలేనని చెప్పేసాడు. దాంతో ఆ మహిళ లాయర్లతో మాట్లాడి నోటీసులు పంపిస్తానని బెదిరించింది. కనీసం 70% డబ్బు రీఫండ్ ఇచ్చినా చాలు అని అడిగింది. ఇందుకు కూడా రోమియో ఒప్పుకోలేదు. దాంతో లీగల్‌గా ప్రొసీడ్ అవుతానని ఆ మహిళ బెదిరించింది.