Viral News: పెళ్లి మండపానికి రాని ప్రియుడు.. మర్మాంగం కోసేసిన ప్రేయసి
Viral News: ఐదేళ్ల పాటు ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని ప్రియుడి మర్మాంగం కోసేసింది. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. సరణ్ జిల్లాకు చెందిన ఓ వైద్యురాలు స్థానిక వార్డు కౌన్సిలర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని ప్రేమించింది. వీరిద్దరూ ఐదేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. పెళ్లి చేసుకోమంటే ఆ అమ్మాయికి మరో అబ్బాయితో ఎఫైర్ ఉందని వాదించి పెళ్లికి నిరాకరించాడు. ఆ తర్వాత తన తప్పు లేదని చెప్పి ఎలాగోలా అతన్ని రిజిస్టర్ మ్యారేజ్‌కి ఒప్పించింది. నిన్న అనుకున్న సమయానికి ఆ యువతి కోర్టుకు వెళ్లింది.
కానీ అబ్బాయి మాత్రం రాలేదు. దాంతో కోపోద్రిక్తురాలైన ఆ యువతి తన ప్రియుడిని మాట్లాడాలని ఇంటికి రమ్మంది. కోపంతో అతని మర్మాంగం కోసేసింది. అతను గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు వచ్చి చూసేసరికే అతను రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు. అతన్ని వెంటనే హాస్పిటల్‌కు తరలించి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.