భర్తకు మ్యాటర్ లేదంటూ నవ వధువు ప్రచారం.. ఆత్మహత్య చేసుకున్న బాధితుడు
Viral News: పెళ్లై వారం రోజులు కూడా కాలేదు. భర్త తనను దగ్గరికి రానివ్వకపోయేసరికి అతనికి మ్యాటర్ లేదంటూ ప్రచారం చేసింది. గ్రామం మొత్తంలో ఈ విషయం తెలీడంతో అతను అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. భగల్‌పూర్ జిల్లాకు చెందిన ఓ జంటకు జులై 30న పెళ్లైంది. అయితే భర్త తనను ఒక్కసారి కూడా ముట్టుకోనివ్వకపోవడంతో అతని మ్యాటర్ లేదంటూ అత్తింట్లో హడావుడి చేసింది. ఆ తర్వాత పుట్టింటికి వెళ్లిపోయి అక్కడ కూడా ప్రచారం చేసింది. అలా ఊరంతా ఈ విషయం పొక్కింది. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్లినా అందరూ అవమానంగా చూస్తుండడంతో తట్టుకోలేకపోయాడు.
ఆ తర్వాత విషయం పంచాయతీ పెద్దల వద్దకు వెళ్లడంతో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అతనిలో నిజంగానే పిల్లల్ని కనే అవకాశం లేదని తెలీడంతో అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నందుకు రూ.80,000 వధువుకి ఇవ్వాలని ఆదేశించారు. ఆ అవమానం తట్టుకోలేక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం పోలీసులకు తెలీడంతో పంచాయతీ పెద్దలతో పాటు వధువు కుటుంబీకులను అదుపులోకి తీసుకున్నారు.