నన్ను ప్రేయసిగా బుక్ చేసుకోండి.. ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి ప్రకటన
Instagram: సోషల్ మీడియాను సరిగ్గా వాడుకుంటూ ఈరోజుల్లో చాలా మంది డబ్బులు సంపాదించుకుంటున్నారు. కానీ కొంత మంది నెటిజన్లు అసభ్యకరమైన పోస్ట్‌లు యాడ్స్ పెడుతూ పరువు తీసుకుంటున్నారు. ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో తన గురించి తానే ఓ ప్రకటన వేసుకుంది. తనని ఎవరైనా ప్రేయసిగా బుకింగ్ చేసుకోవచ్చట. దివ్య గిరి అనే యువతి ఈ ప్రకటన పెట్టింది. ఆ ప్రకటనలో ఏముందంటే.. నన్ను ఒక రోజు రెంట్‌కి తీసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింది రేట్లు చూడండి.
కాఫీ డేట్ – రూ.1500
డిన్నర్ లేదా మూవీ – రూ.2000
కుటుంబానికి పరిచయం చేయాలంటే – రూ.3000
బైక్ మీద వెళ్లాలన్నా.. అలా వెళ్లేటప్పుడు నేను చేతులు వేయాలన్నా – రూ.4000
ఇంట్లో మీతో పాటు కలిసి వంట చేయాలంటే – రూ.3500
మీతో కలిసి షాపింగ్‌కి రావాలంటే – రూ.4,500
వీకెండ్‌కి రెండు రోజులు మీతో కలిసి బయటికి రావాలంటే- రూ.10000
ఈ పోస్ట్‌పై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో నేను రెడీ అని కామెంట్స్ పెడుతుంటే మరికొందరు ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యభిచారం ఎక్కువైపోయింది అని మండిపడుతున్నారు. ఇలాంటి ఖాతాలకు అనుమతి ఇవ్వకూడదు అని విమర్శిస్తున్నారు.