Aadhaar Card: జూన్ 14 తర్వాత ఆధార్ కార్డు వర్తించదా?
Aadhaar Card: ఆధార్ కార్డు విషయంలో సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు వస్తున్నాయి. జూన్ 14 తర్వాత నుంచి ఆధార్ కార్డులు వర్తించవు అని అంటున్నారు. అది కూడా అన్ని ఆధార్ కార్డులు కావు.. కేవలం పదేళ్ల క్రితం తీసుకున్న ఆధార్ కార్డులు మాత్రమే వర్తించవు అనే టాక్ వినిపిస్తోంది. పదేళ్ల క్రితం తీసుకున్న ఆధార్ కార్డులను జూన్ 14 లోపు అప్డేట్ చేయించుకోవాలట. లేదంటే జూన్ 14 నుంచి అవి వర్తించవని.. ఆ తర్వాత ఆధార్ కార్డులు సబ్మిట్ చేయాల్సిన సమయంలో చాలా సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు.
అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని UIDAI స్పష్టం చేసింది. జూన్ 14 వరకు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని అనుకునేవారికి ఎలాంటి చార్జీలు వర్తించవు. జూన్ 14 తర్వాత చేసుకుంటే మాత్రం లేట్ ఫీజ్ చెల్లించాల్సి వస్తుంది. అంతేకానీ.. జూన్ 14 తర్వాత ఆధార్ కార్డులు వర్తించవు అనడంలో ఏమాత్రం నిజం లేదని వెల్లడించింది.