వాడ్ని బ‌తికించ‌కండి.. ఎఫైర్ పెట్టుకున్న భ‌ర్త‌పై భార్య రివెంజ్

wife took revenge on husband who was cheating her

Viral News: తన‌ను పెళ్లి చేసుకుని మ‌రో యువ‌తితో అక్ర‌మ సంబంధం పెట్టుకుని త‌న‌ని మోసం చేసిన భ‌ర్త‌పై ఓ భార్య స‌రైన స‌మ‌యం చూసి రివెంజ్ తీర్చుకుంది. ఈ ఘ‌ట‌న చైనాలో చోటుచేసుకుంది. చైనాకు చెందిన లీ అనే యువ‌తికి చాంగ్‌తో ప‌దేళ్ల క్రితం పెళ్లైంది. అయితే లీని మోసం చేసి చాంగ్ మ‌రో యువ‌తితో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆమెతోనే స‌హ‌జీవ‌నం చేస్తున్నాడు. లీని రోడ్డున ప‌డేసాడు. క‌నీసం ఆర్థిక సాయం కూడా చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో వారం రోజుల క్రితం లీకి బ్రెయిల్ స్ట్రోక్ వ‌చ్చింది. దాంతో లీ ప్రేయ‌సి వెంట‌నే అత‌న్ని హాస్పిట‌ల్‌లో చేర్పించి ఎక్క‌డ త‌న‌కు ఈ కేసు భారం అవుతుందో అని పారిపోయింది.

దాంతో పోలీసులు చాంగ్ భార్య లీని సంప్ర‌దించారు. జరిగిన‌దంతా చెప్పారు. వెంట‌నే లీ చాంగ్ చికిత్స పొందుతున్న హాస్పిట‌ల్‌కు వెళ్లింది. చాంగ్‌కి వెంట‌నే స‌ర్జ‌రీ చేయాల‌ని.. స‌ర్జ‌రీ చేసినా బ‌తుకుతాడ‌న్న న‌మ్మ‌కం లేద‌ని అన్నారు. ప్ర‌స్తుతం వెంటిలేట‌ర్‌పై ఉన్నాడ‌ని.. చికిత్స‌కు బాగా ఖ‌ర్చు అవుతుంద‌ని చెప్పారు. అయితే ఇందుకు లీ ఒప్పుకోలేదు. క‌నీసం తాను బ‌తికున్నానో లేదో తెలుసుకోకుండా వ‌దిలేసిపోయిన చాంగ్‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని.. చికిత్స‌కు కావాల్సిన ఫార్మాలిటీల‌పై తాను సంత‌కం చేయ‌న‌ని తేల్చి చెప్పేసింది. వెంటిలేట‌ర్ తీసేసి అత‌న్ని చంపేయాల‌ని వైద్యుల‌ను కోరి అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. చాంగ్ ఇంట్లో వారెవ్వ‌రూ సంప్రదించేందుకు హాస్పిట‌ల్‌కు రాక‌పోవ‌డంతో ఏం చేయాలో వైద్యులకు పాలుపోవ‌డం లేద‌ట‌.